Mehreen pirzada (Source: Instragram)
మెహరీన్ పిర్జాదా తొలిసారి నాని హీరోగా నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Mehreen pirzada (Source: Instragram)
ఇక 2017లో ఫిల్లౌరీ అనే సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
Mehreen pirzada (Source: Instragram)
ఇక బాలీవుడ్లో అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు. క్రమంగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, ఎంత మంచి వాడవురా ఇలా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Mehreen pirzada (Source: Instragram)
సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడైన భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. కానీ కాస్త విభేదాలు రావడంతో ఆ నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.
Mehreen pirzada (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ గ్లామర్ ఫోటోలను పంచుకునే ఈమె తాజాగా ప్రేమలో పడినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై మెహ్రీన్ స్పందించలేదు.
Mehreen pirzada (Source: Instragram)
ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో ఎల్లో కలర్ అవుట్ ఫిట్ లో గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడు గ్లామర్ వలకబోసే ఈమె.. ఇప్పుడు ఒంటినిండా దుస్తులతో కనిపించేసరికి మార్పు బాగుంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.