BigTV English

Passport online portal Shut: ఈ రోజు నుంచి పాస్ పోర్ట్ ఆన్ లైన్ సేవలు బంద్.. ఎప్పటివరకంటే?

Passport online portal Shut: ఈ రోజు నుంచి పాస్ పోర్ట్ ఆన్ లైన్ సేవలు బంద్.. ఎప్పటివరకంటే?

Passport online portal Shut| విదేశాలకు అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఒక బ్యాడ్ న్యూస్. ఈ రోజు నుంచి పాస్ పోర్ట్ అప్లికేషన్ల ఆనైలైన్ పోర్టల్ సేవలు మరో అయిదు రోజుల వరకు నిలిపివేయబడ్డాయి. గురువారం ఆగస్టు 29 రాత్రి 8 గంటల నుంచి ఈ సేవలు నిలిపివేయబడతాయని పాస్ పోర్ట్ సేవా పోర్టల్ అధికారికంగా ప్రకటించింది.


ఈ అయిదు రోజుల పాటు కొత్త అపాయింట్ మెంట్స్ ఉండవు. పాత అపాయింట్ మెంట్స్ కూడా రీ షెడ్యూల్ చేయబడతాయని ప్రకటనలో సూచించారు. పోర్టల్ మెయిన్ టెనెన్స్ కారణంగా టెంపరరీగా పాస్ పోర్ట్ ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

”టెక్నికల్ మెయింటెనెన్స్ కారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్టు 29, 2024 గురువారం రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2, 2024 సోమవారం ఉదయం 6 గంటల వరకు నిలిపివేయబడుతుంది. కేవలం పౌరుల కోసమే కాదు పాస్ పోర్ట్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే MEA/RPO/BOI/ISP/DoP/, పోలీసు విభాగాలకు కూడా పోర్టల్ అందుబాటులో ఉండదు. ఆగస్టు 30, 2024న షెడ్యూల్ అయిన అపాయింట్ మెంట్స్ తిరిగి రీ షెడ్యూల్ చేయబడతాయి. అపాయింట్ మెంట్స్ ఉన్న అందరు పాస్ పోర్ట్ దరఖాస్తు దారులకు ఇప్పటికే సూచన చేయబడింది.” అని పాస్ పోర్ట్ సేవా పోర్టల్ లో ప్రకటన జారీ చేశారు.


ఈ అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ లో పనిచేసే ఒక అధికారి మాట్లాడుతూ.. ”అపాయింట్ మెంట్స్ ఉన్నవారికి రీ షెడ్యూల్ చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రజా సేవ కోసం పనిచేసే పాస్ పోర్ట్ కేంద్రాలు మెయింటెనెన్స్ పనుల కోసం చాలా ముందస్తుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రజలక ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఒక అపాయింట్ మెంట్ రీషెడ్యూల్ చేయడం పెద్ద సమస్య కాదు.” అని అన్నారు.

నకిటీ పాస్ పోర్ట్ వెబ్ సైట్లతో జాగ్రత్త!
పాస్ పోర్ట్ దరఖాస్తు దారులను మోసం చేసి వారి వద్ద నుంచి ఫీజు పేరుతో డబ్బులు దోచుకోవడం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పాస్ పోర్ట్ సేవా పేరుతో నకిటీ వెబ్ సైట్లు, నకిటీ మొబైల్ యాప్ లు ఉన్నాయని వాటి ద్వారా సైబర్ దొంగలు ప్రజల నుంచి డేటా, అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఫీజు, అపాయింట్ మెంట్ ఫీజ్, ఇతర ఫీజులని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు.

ఫేక్ వెబ్ సైట్లను గుర్తించండి ఇలా..
భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైబ్ www.passportindia.gov.in అని మాత్రమే ఉంటుంది. ఈ పేరుతో కాకుండా.. *.org, *.in, *.com డొమైన్ నేమ్ ఉన్న వెబ్ సైట్లన్నీ నకిలీవి. ఉదాహరణకు www.indiapassport.org, www.online-passportindia.com, www.passportindiaportal.in, www.passport-india.in, www.passport-seva.in, www.applypassport.org.. ఇలా వేరే ఎన్ని పేర్లున్నా అవన్నీ నకిలీ వెబ్ సైట్లు. కేవలం www.passportindia.gov.in మాత్రమే ప్రభుత్వ వెబ్ సైట్ అని భారత పౌరులందరూ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్త వహించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.

Also Read: జియో సినిమా లో హాట్ స్టార్ విలీనం పూర్తి.. ఆమోదించిన సిసిఐ

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×