BigTV English

Chandra Hass: నాకు నచ్చిందే చేస్తా, ఇంతకంటే పర్ఫెక్ట్ డెబ్యూ సినిమా ఇంకెవరూ చేయలేదు.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

Chandra Hass: నాకు నచ్చిందే చేస్తా, ఇంతకంటే పర్ఫెక్ట్ డెబ్యూ సినిమా ఇంకెవరూ చేయలేదు.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

Attitude Star Chandra Hass: సినీ పరిశ్రమలో ఆఫ్ స్క్రీన్ పనిచేసే టెక్నీషియన్ కూడా తన వారసురాలను ఆన్ స్క్రీన్ హీరోలుగానే చూడాలని అనుకుంటారు. అలాగే బుల్లితెరపై ఎంత గుర్తింపు సాధించినా తన కొడుకును వెండితెరపై హీరోగానే చూడాలని అనుకుంటున్నాడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్. ఒకప్పుడు సీరియల్స్‌లో హీరోగా బుల్లితెరపై విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రభాకర్. ఇప్పటికీ తను సీరియల్స్‌తో బిజీగానే ఉన్నారు. కానీ తన కొడుకు చంద్రహాస్‌ను మాత్రం హీరో చేయాలని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే చంద్రహాస్ నటించిన ఫస్ట్ మూవీ కూడా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీంతో వీరిద్దరూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


యాటిట్యూడ్ స్టార్

శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామ్‌నగర్ బన్నీ’ అనే మూవీతో చంద్రహాస్ హీరోగా పరిచయం అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మామూలుగా ఏ హీరో అయినా డెబ్యూ తర్వాతే ఒక ట్యాగ్‌ను సంపాదించుకుంటారు. కానీ చంద్రహాస్ మాత్రం తను హీరోగా పరిచయం అవుతున్నాడని తన తండ్రి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చూపించిన యాటిట్యూడ్‌కు యాటిట్యూడ్ స్టార్ అయిపోయాడు. దీంతో ‘రామ్‌నగర్ బన్నీ’కి సంబంధించిన ప్రతీ పోస్టర్‌లో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అనే కనిపిస్తోంది. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రహాస్.. ఇందులో తన లిప్ లాక్ సీన్‌పై స్పందించాడు.


Also Read: ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఇంట్లో కూడా.. జానీ మాస్టర్‌‌ కేసులో సంచలన నిజాలు

కెరీర్ గురించే ఆలోచన

‘రామ్‌నగర్ బన్నీ’లో తను చేసిన లిప్ లాక్ గురించి మాట్లాడుతూ ఆ క్యారెక్టర్ పరంగా చేయాల్సి వచ్చిందని అన్నాడు చంద్రహాస్. అలా తన కొడుకు చంద్రహాస్ చేస్తే ఒప్పుకునేవాడిని కాదని, రామ్‌నగర్ బన్నీ చేశాడు కాబట్టి ఓకే అని ప్రభాకర్ కవర్ చేశాడు. డెబ్యూ మూవీ గురించి తన ఎక్స్‌పీరియన్స్ చెప్తూ.. ‘‘ఒక డెబ్యూ సినిమా ఇంతకంటే పర్ఫెక్ట్‌గా ఉండదేమో. ఇంతకంటే పర్ఫెక్ట్ డెబ్యూ సినిమా ఇంకెవరూ చేయడం నేను చూడలేదు. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ జెనరేషన్‌లోని ప్రతీ అబ్బాయి కనెక్ట్ అవుతాడు. ఇందులో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. హీరోకు ఒక అమ్మాయి నచ్చకపోతే ఇంకొక అమ్మాయిని చూసి అదే లవ్ అనుకుంటాడు’’ అని క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. రియల్ లైఫ్‌లో తను అలా కాదని, కెరీర్ ఓరియెంటెడ్ మైండ్ అని అన్నాడు.

ట్రోల్ చేస్తారు

‘‘ఎంత నేర్చుకున్నా నాకు అన్నీ కష్టంగానే అనిపించాయి. నాపైన ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి కాబట్టి అన్నీ క్షుణ్ణంగా చూస్తారు. ఏదైనా దొరికితే ట్రోల్ చేయొచ్చు అనుకుంటారు. నేను ఒక పర్ఫెక్షనిస్ట్. నేను చేసింది నాకు నచ్చాలి. రామ్‌నగర్ బన్నీ మూవీలో నాకు నచ్చకుండా ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. ముందుగా నాకు అనిపించింది చేస్తాను. తర్వాత దర్శకుడికి, నాన్నకు కావాల్సింది చేస్తాను. ఆపై ఎడిటింగ్‌లో చూసుకుంటాం’’ అంటూ తన మనస్థత్వం గురించి బయటపెట్టాడు చంద్రహాస్. మొత్తానికి మొదటి ఇంటర్వ్యూతోనే యాటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్.. మంచి హీరోగా ప్రేక్షకులను మెప్పించగలడా లేదా చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×