E-Paper
Advertisement

పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆకాశానికి చేరిన బంగారం ధరలు!

పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆకాశానికి చేరిన బంగారం ధరలు!
Advertisement

Gold Rate Hike: షాకింగ్.. నిన్నమొన్నటి వరకు వరుసగా తగ్గుతూ కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు, రెండు రోజుల నుంచి మళ్లీ ఒక్కసారిగా పైపైకి దూసుకెళ్తూ షాకిస్తున్నాయి. “అమ్మో.. ధరలు తగ్గాయి కదా, ఓ నగల ముక్క చేయించుకుందాం” అని ఆశగా ఎదురుచూసిన మధ్యతరగతి ప్రజలకు ఈ ఆకస్మిక పెరుగుదల గట్టి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న ఈ ధరల ట్రెండ్ చూస్తుంటే, పసిడి ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది.

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,780 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,000 వద్ద పలుకుతుంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,800 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,750 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.3,220 పెరిగింది.

Advertisement

పసిడి ధరలు ఎందుకు పెరిగాయి?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న కొన్ని కీలక పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఈ అకస్మాత్తు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు కూడా మన దేశంలో పసిడి రేట్లు పెరగడానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా లేక రాబోయే రోజుల్లో మళ్లీ ఏమైనా దిగివస్తుందా అనేది మార్కెట్ ఒడిదుడుకులను బట్టే చెప్పగలం.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,750 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,000 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,750 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,750 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,900 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
వామ్మో.. బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా దూసుకుపోతున్నాయి. నేటి ధరలు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ రూ. 2,50,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో ఒకేసారి కేజీపై రూ. 5,000 పెరిగి ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద పలుకుతోంది.

Also Read: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడి చేతిలో స్టీరింగ్.. 9 మంది సాధువుల దుర్మరణం

Related News

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!

Big Stories

Advertisement
×