Pickle Business: ఓ యువతికి ఇంజనీరింగ్ చేసినా… ఆఫీస్‌కి వెళ్లేందుకు మనసొప్పలేదు. ఆ క్రమంలో ఏం చేయాలని ఆలోచించింది. కొలువు కెరీర్‌ను పక్కనబెట్టి, భామ్మచెప్పిన పచ్చడి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. తన ఇంట్లో భామ్మ చేసిన ఆవకాయ టేస్ట్ మర్చిపోలేక, అదే టేస్ట్‌ను ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో మొదలు పెట్టిన వ్యాపారం ఇప్పుడు వారి ఇంటితోపాటు అనేక మందికి ఉపాధిని అందిస్తోంది. అంతేకాదు ఆమె ప్రయాణం ఇప్పుడు అనేక మందికి స్పూర్తిగా నిలుస్తోంది. అయితే ఆ యువతి అందుకోసం ఏం చేసింది. లాభాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం కావాలి…
భారతీయ వంటకాల్లో పచ్చడి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందని చెప్పవచ్చు. టమాటో, మామిడి, నిమ్మ, ఉసిరి, గోంగూర ఇలా అనేక రకాలుగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అమ్మాయి. తన భామ్మ చేసిన టామట పచ్చడి రుచులను గడప దాటించి, ప్రపంచానికి చూపించాలనుకుంది. అందుకోసం తన ఇంట్లో వారి సహకారం తీసుకుని ఈ వ్యాపారం ప్రారంభించింది. అందుకోసం తాజా టమాటాలను సేకరించింది. దీంతోపాటు నాణ్యమైన మసాలా దినుసులు (ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు) సిద్ధం చేసుకుంది. నూనె (నువ్వుల నూనె, వేరుశనగ నూనె), ఉప్పు, బెల్లం, వినెగర్ వంటివి కూడా ఏర్పాటు చేసుకుంది.
Read Also: Sony 65 Inch TV: సోనీ టీవీపై రూ.65 వేల తగ్గింపు ఆఫర్..బిగ్ డీల్..
8 వేల పెట్టుబడి
ఈ క్రమంలో పచ్చళ్ల తయారీ (Pickle Business) కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు, గ్రైండర్లు, మిక్సర్లను వినియోగించింది. లేబులింగ్, ప్యాకేజింగ్ కోసం స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్ ఉపయోగించింది. దీంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ కూడా పొందింది. మొదట్లో ఇంట్లో చిన్న స్థాయిలో రూ. 8 వేల పెట్టుబడితో ప్రారంభించింది.
85 కిలోల నుంచి
ఈ క్రమంలో 100 కేజీల టామాటాలను కొనుగోలు చేసి 85 కేజీల పచ్చడిని సిద్ధం చేసింది. ఆ తర్వాత వాటిని 200 గ్రాముల ప్యాకేట్లుగా ప్యాకింగ్ చేసి సేల్ చేసేందుకు సిద్ధం చేసింది. 85 కిలోల నుంచి 200 గ్రాముల చొప్పున మొత్తం 425 ప్యాకేట్లు సిధ్దమయ్యాయి. వాటిని బయట మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువకే అమ్మాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒక్కో దానిని రూ.160కి సేల్ చేస్తే ఆమెకు వచ్చిన మొత్తం రూ. 68 వేలు. పెట్టుబడి తీసివేయగా వచ్చిన మొత్తం రూ.60 వేలు.
సేల్ చేయడం
దీంతోపాటు ఆ యువతి తర్వాత ఇతర పచ్చళ్లను కూడా తయారు చేసి సేల్ చేయడం ప్రారంభించింది. మరోవైపు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన వ్యాపారాన్ని ప్రచారం చేయడం, ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఇతర ప్రాంతాలకు సేల్ చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలో స్థానిక సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులతో ఒప్పందాలు చేసుకుని నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకుంది.
అడ్డంకులు
ఏ వ్యాపారమైనా సవాళ్లు లేకుండా ముందుకు సాగదు. ఆ యువతికి కూడా మొదట్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. మొదట, నాణ్యమైన ముడి పదార్థాలను సరసమైన ధరలో సేకరించడం కష్టంగా ఉండేది. కానీ స్థానిక రైతులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆమె ఈ సమస్యను అధిగమించింది.