Pooja Hegde:పూజా హెగ్డే (Pooja Hegde).. అందం, అభినయంతో ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలకు సైతం ఫస్ట్ ఛాయస్గా నిలిచిన పూజా హెగ్డే.. గత ఐదు సంవత్సరాలుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.’ అలా వైకుంఠపురం లో’ సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఇప్పటివరకు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలోకి నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. అల వైకుంఠపురంలో సినిమా వరకు కూడా స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇక ఆచార్య సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎఫ్ 3 సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ అందులో ఈమె పాత్ర కేవలం స్పెషల్ సాంగ్ కే పరిమితమైంది.
వరుస సినిమాలు.. ఫ్లాప్ లు తప్పట్లేదా..?
ఈ ఐదు సంవత్సరాల కాలంలో తమిళ చిత్రం బీస్ట్ ఓకే కానీ.. హిందీ సినిమాలు సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇక ఏడాది ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ను చవిచూశాయి. షాహిద్ కపూర్ సరసన నటించిన దేవా చిత్రం డిజాస్టర్ కాగా.. ఇటీవల తమిళ్ చిత్రం రెట్రో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తెలుగు సినిమాలను తగ్గించుకొని మరీ హిందీ, తమిళ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. కానీ ఏ ఇండస్ట్రీలో కూడా ఈమెకు సరైన హిట్ లేక సక్సెస్ కోసం తెగ ఆరాటపడుతోంది. ఇక ఇటీవల వచ్చిన రెట్రో సినిమాలో పూజా డీ గ్లామర్ పాత్రను పోషించింది. ఈ పాత్ర తన మనసుకు ఎంతో నచ్చిందని, రాబోయే రోజులలో ఇలాంటి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. కానీ ఈ సినిమా ఊహించని రీతిలో పరాజయం పొందడంతో ఆమె నిర్ణయం తప్పు అయింది అని తెలుస్తోంది. అటు సినిమానే కాదు ఇటు డీ గ్లామర్ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇంకా దీంతో ఇలాంటి పాత్రల కంటే ఈమె ఇండస్ట్రీకి దూరమైతేనే బెటర్ అనే వార్త జోరుగా వినిపించడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
పూజా పెళ్ళికి ఆసన్నం అయిందా..?
ఇక మరొకవైపు పూజా హెగ్డే ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది. అలాగే విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ లో కూడా ఈమె నటిస్తోంది. అంతేకాదు లారెన్స్ ‘కాంచన -4’ తో పాటు హిందీ సినిమా ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’లో కూడా పూజా హెగ్డే నటిస్తోంది. మరి ఈ సినిమాలతో ఈమె విజయం సాధిస్తే.. కొంతకాలం సాగుతుంది. లేకపోతే 34 సంవత్సరాలు వచ్చినా పెళ్లి దిశగా ఆలోచనలు వేయడం లేదు. కాబట్టి ఇకనైనా పెళ్లి చేసుకుంటే నయమని పెళ్లికి కూడా టైం వచ్చేసిందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి పూజా హెగ్డే ఇకనైనా అడుగులు వేస్తుందేమో చూడాలి.