కేంద్ర ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాల్లో ప్రధానంగా మహిళలు, సీనియర్ సిటిజన్స్, ఎస్సీ ఎస్టీ తరగతులకు చెందిన వారు, ఓబీసీలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలోనూ సంఘటిత రంగంలో మాత్రమే కార్మికులకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ లభిస్తుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వృద్ధాప్య పెన్షన్ మాత్రమే దిక్కు అవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PM-KMY) పథకం ప్రారంభించింది.
ఈ స్కీం కింద చిన్న సన్నకారు రైతులకు 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ స్కీం ప్రధాన ఉద్దేశం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు ఒక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయలేరు. ఆ సమయంలో వారికి పెన్షన్ అనేది ఒక ఆసరా అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ప్రారంభించారు. ఈ పథకం కింద వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం రైతులు గడిపేందుకు ఆస్కారం లభించింది అని చెప్పవచ్చు.
ఈ 3000 రూపాయల పెన్షన్ స్కీం రైతుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగింది. కనుక ఈ స్కీం కింద రైతులకు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. దీనికోసం నిర్ణీత కాలం వరకు పెన్షన్ కోసం ప్రతినెల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కూడా కేవలం 55 రూపాయలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
ప్రధానమంత్రి కిసాన్ మానధాన్ యోజన కింద అసంఘటిత రంగంలో పనిచేసిన రైతులకు పెన్షన్ పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి అర్హతలు కావాలో తెలుసుకుందాం…
ఈ పథకంలో చేరే యువ రైతులకు కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే 5 ఎకరాల కన్నా తక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓ, జాతీయ పెన్షన్ స్కీం, రాష్ట్ర ప్రభుత్వ బీమా సంస్థ వంటి సోషల్ వెల్ఫేర్ స్కీముల్లో చేరి ఉన్నట్లయితే ఈ స్కీము లభించదు.
నెలకు రూ. 3,000 లభించే ఈ స్కీం కోసం ప్రతి నెల 55 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఆధారంగా నడిచే పథకం. ఈ స్కీములో చేరడం అనేది రైతుల వ్యక్తిగత ఇష్టానుసారంగా జరుగుతుంది. ఈ స్కీములో మొత్తం రైతు తన వాటా కింద 55 రూపాయలు జమ చేసినట్లయితే, అందులో కొంత మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా కలిపి రైతు పేరిట పెన్షన్ ఎకౌంట్ ప్రారంభిస్తుంది.
3000 రూపాయల పెన్షన్ కోసం ఇలా అప్లై చేసుకోవాలి
ముందుగా యువ రైతులు, ఈ స్కీంలో చేరి భవిష్యత్తులో పెన్షన్ పొందాలి అనుకున్నట్లయితే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ స్కీములో ప్రతి నెల రూ.55 మదుపు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీములో మదుపు చేసినట్లయితే కిసాన్ మాన్ ధన్ కార్డు మీ చేతికి అందజేస్తారు . నేరుగా మీ బ్యాంకు ఎకౌంటు నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ద్వారా కూడా ఈ స్కీమ్ లో మీరు ప్రతి నెల 55 రూపాయల కాంట్రిబ్యూషన్ కట్టవచ్చు.