BigTV English

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు అందులో డేటా అనేది తప్పనిసరి. అందుకు తగ్గట్టుగానే చాలామంది డేటా ఎక్కువగా అందించే మొబైల్ నెట్ వర్క్ లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ డేటా అనేది నేడు తప్పనిసరి అయిపోయింది. కాల్స్ మాట్లాడేందుకు కూడా మొబైల్ యాప్స్ ఉపయోగించి కస్టమర్లు డేటాను వినియోగిస్తున్నారు. ఇక ఇంటర్నెట్ డేటా అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తమ పనుల కోసం డేటాను ఎక్కువగా వినియోగించుకుంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చూసేందుకు కూడా యాప్స్ ఓపెన్ చేయడానికి డేటా అనేది పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది. సినిమాలు చూడటానికి కూడా పెద్ద మొత్తంలో డేటా కావాల్సి ఉంటుంది.


ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు లాంగ్ వాలిడిటీ ఉన్న రీఛార్జ్ ప్లాన్లతో పాటు డేటా ఆఫర్లతో ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. డేటా ఉపయోగించి ఇంటర్నెట్ సేవలను కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు. తద్వారా ఇది వారి ఉపాధి అలాగే విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో మార్కెట్లో మరెవరు కూడా సాహసం చేయని రీతిలో బిఎస్ఎన్ఎల్ ఏకంగా 365 రోజులపాటు 600gbల డేటా వినియోగించుకునేలా ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. 1999 రూపాయలతో బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయించుకున్నట్లయితే ఏకంగా 600 జీబీల డేటా లభిస్తుంది. ఇది ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వారికి, అలాగే విద్యార్థిని విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది రీఛార్జ్ ప్యాకేజీల్లో1999 తో పాటు అనేక రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 1,515 ప్లాన్, 1,499 ప్లాన్, 1,859 ప్లాన్, 1,515 ప్లాన్, 2,399 ప్లాన్ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు.


1999 రీచార్జ్ ప్లాన్ :
365 రోజుల వ్యాలిడిటీతో ఉండే ఈ స్కీం కింద మొత్తం 600 జిబి ల డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

1,515 రీచార్జ్ ప్లాన్:
మొత్తం 365 రోజుల వ్యాలిడిటీతో, రోజుకు 2 జిబి డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఈ స్కీం ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా పంపించవచ్చు.

1,499 రీచార్జ్ ప్లాన్:
336 రోజుల వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ స్కీం ద్వారా 120జీబీల డేటా ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ ఈ స్కీం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

1,859 రీచార్జ్ ప్లాన్:

మొతం 365 రోజుల వ్యాలిడిటీ తో పాటు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. . దీంతోపాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి.

2,399 రీచార్జ్ ప్లాన్:

మొత్తం 425 రోజుల వాలిడిటీ తో ఉండే ఈ ప్యాక్ ప్రతిరోజు 2 జిబి డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ . ఉచితంగా పంపుకునే అవకాశం లభిస్తుంది. ఈ స్కీం ఎక్కువగా బిజినెస్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు ఈ స్కీం కొనసాగడం దాన్ని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Related News

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Big Stories

×