Pm Matru Vandana Yojana: మనదేశంలో మహిళ సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలను తీసుకువచ్చింది. అందులో ప్రధానమంత్రి మాతృ వందన యోజన కూడా ఒకటి. ఈ పథకం కింద గర్భిణీలకు ప్రభుత్వం రూ.11వేల రూపాయాల ఆర్థికసాయం అందిస్తుంది. అంతే కాకుండా ఇది నేరుగా లబ్ధి దారుల ఖాతాలోకి చేరుతుంది. దేశంలోని బలహీన వర్గాలకు చెందిన, ఆర్థికంగా వెనకబడిన కుటంబాలకు చెందిన మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ముఖ్యంగా కార్మికులు అయిన మహిళల కోసం రూపొందించారు.
Also read: ఇంటి ముందే కౌన్సిలర్ పై దుండగుల కాల్పులు.. తుపాకీ పేలకపోవడంతో సీన్ రివర్స్!
ఎందుకంటే కార్మికులు అయిన మహిళలు గర్భం దాల్చిన సమయంలో పని కోల్పోయే అవకాశం ఉంది. ఆ సమయలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంది. కాబట్టి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు, పోషక ఆహార అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2017లో జనవరి 1న కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గర్భిణీలతో పాటూ పాలిచ్చే తల్లులకు కూడా ఆర్థికసాయం అందిస్తున్నారు. అంతే కాకుండా మొదటి గర్భం సమయంలో పథకం కింద రూ.5వేలు ఆర్థికసాయం అందజేస్తారు. రెండవసారి గర్భం దాల్చి కూతురు పుడితే రూ.6వేలు ఆర్థికసాయం అందజేస్తారు.
అలా మొత్తంగా రూ.11వేలు ఈ పథకం కింద అందించనున్నారు. పథకం కింద ఆర్థికసాయంతో పాటూ ప్రసవం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి చెబుతారు. ఇక మొదటి గర్భం సమయంలో రెండు విడతలుగా డబ్బులు అందజేస్తారు. వైద్య పరీక్షలు, రిజిస్ట్రేషన్ కింద రూ.3వేలు ఇస్తారు. బిడ్డ పుట్టిన తరవాత రూ.2వేలు ఇస్తారు. రెండవసారి ఆడబిడ్డ పుడితేనే రూ.6వేలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకానికి పంతొమ్మిది, ఆపై వయసు ఉండి ఆధార్ కార్డు, పాన్ కార్డు కలిగి ఉన్న మహిళలు అందరూ అర్హులే. అయితే ఈ పథకం గురించి మాత్రం చాలా మందికి తెలియదు.