Attack On Tmc Councillor: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పై హత్యాయత్నం జరిగింది. ఇద్దరు దుండగులు వచ్చి ఇంటి ముందు కూర్చుని ఉన్న కౌన్సిలర్ పై కాల్పులు జరపగా గన్ పేలకపోవడంతో కౌన్సిలర్ బతికిపోయారు. ఈ షాకింగ్ ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొల్ కతాలోని కస్బా ప్రాంతంలో తృణమూల్ కౌన్సిలర్ సుశాంత ఘోష్ తన ఇంటి ముందు కూర్చుని ఉండగా ఇద్దరు దుండగులు స్కూటర్ పై వచ్చారు. స్కూటర్ ఆపి వెంటనే ఇద్దరిలో ఒకరు సుశాంత ఘోష్ పై కాల్పులు జరిపారు. కానీ తుపాకీ పనిచేయకపోవడంతో కౌన్సిలర్ తప్పించుకున్నారు.
వెంటనే దుండగులను పట్టుకునే ప్రయత్నం చేయగా స్కూటర్ పై పారిపోతూ తుపాకీతో కాల్చిన వ్యక్తి కింద పడిపోయాడు. దీంతో దుండగుడిని పట్టుకుని ఎవరు పంపారో చెప్పాలని దాడి చేశారు. దీంతో దుండగుడు తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, కేవలం ఫోటో ఇచ్చి చంపేయమన్నారని చెప్పాడు. కానీ ఎవరు పంపించారు? ఎందుకు చంపాలనుకున్నాడు అనే వివరాలను వెల్లడించలేదు. ఈ క్రమంలో పోలీసులు రావడంతో నింధితున్ని వారు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని విచారించగా… కౌన్సిలర్ ను చంపేందుకు బీహార్ నుండి దుండగులను రప్పించినట్టు తేలింది. అంతే కాకుండా హత్యాయత్నానికి స్థానిక నాయకుల మధ్య ఉన్న గొడవలే కారణం అని తెలిసింది. ఘటన అనంతరం కౌన్సిలర్ సుశాంత్ ఘోష్ మాట్లాడుతూ.. తనపై ఎవరు హత్యాయత్నం చేశారో తెలియదని అన్నారు. గత 12 ఏళ్లుగా తాను కౌన్సిలర్ గా ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. తనపై దాడి జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని, అది కూడా ఇంటి ముందు కూర్చున్న సమయంలో దాడి జరగడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కౌన్సిలర్ పై కాల్పులు జరిపిన
Caught on CCTV: Gunman attempts to open fire on #TMC councillor Susanta Ghosh outside his south #Kolkata residence but FAILS
Gunman has been arrested, caught by locals while trying to flee. Initial reports suggest contract killers were hired from outside #Bengal pic.twitter.com/lBdGdB8H6j
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) November 15, 2024