Big Stories

Porsche Panamera 2024 Launched: రూ. 1.69 కోట్లతో పోర్షే సూపర్ కార్ లాంచ్.. ఇక రోడ్లపై యుద్ధమే..!

2024 Porsche Panamera Launched: ధనవంతులు తమ స్టేటస్‌కు తగ్గట్టుగా కార్లను కొనుగోలు చేస్తారు. అందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడతారు. మార్కెట్‌లో ఏ లగ్జరీ కారు లాంచ్ అయిన మొదటగా వారి గ్యారేజ్‌లో ఉండాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ కార్ల కంపెనీలు పోటాపోటీగా లగ్జరీ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఈ కార్లు డిజైన్, ఫీచర్ల పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. హై లెవల్‌లో ఉంటాయి. అందుకే ఈ కార్లంటే ప్రతి ఒక్కరికి బీభత్సమైన మోజు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే తన కొత్త కారును లాంచ్ చేసింది.

- Advertisement -

పోర్షే ఇండియా 2024 పనామెరాను భారత మార్కెట్లో రూ. 1.69 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ లగ్జరీ సెడాన్‌కు కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటు ఫీచర్లు కూడా తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా LED మ్యాట్రిక్స్ లైట్లను ఇచ్చారు. క్యాబిన్ లోపల, దాని గేర్ సెలెక్టర్ కొత్త స్టీరింగ్ వీల్ కుడి వైపున ఉంటుంది. 2024 పోర్షే పనామెరా హుడ్ కింద 2.9-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్‌ను పొందుతుంది. Panamera త్వరలో డెలివరీలను కూడా ప్రారంభిస్తారు. దీని ఫీచర్లు, తదితర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -

Also Read: ఈ ఏడాది లాంచ్ కానున్న క్యూటెస్ట్ కార్లు ఇవే..!

2024 పోర్షే పనామెరా డిజైన్ గురించి మాట్లాడితే దీనికి అప్‌డేట్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు ఇవ్వబడ్డాయి. ఇవి ఇప్పుడు ప్రధాన LED మ్యాట్రిక్స్ లైట్లతో అమర్చబడ్డాయి. అదనంగా లైసెన్స్ ప్లేట్ పైన ఉన్న అదనపు ఎయిర్ ఇన్‌లెట్, కొత్త విండో లైన్‌లు కొత్త లుక్‌ను ఇస్తాయి.

2024 పోర్షే పనామెరా ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్ లోపల, దాని గేర్ సెలెక్టర్ కొత్త స్టీరింగ్ వీల్  కుడి వైపున ఉంటుంది. ఈ ఫీచర్ ఎలక్ట్రిక్ Taycan నుండి తీసుకోబడింది. అదనంగా ఇందులో 10.9-అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే ఉంది. ఇందులో లెటెస్ట్ టెక్నాలజీని చూడొచ్చు.

Also Read: మైండ్ బ్లోయింగ్ కలర్‌తో మహీంద్రా బ్లేజ్ ఎడిషన్‌.. ధర ఎంతంటే?

2024 పోర్షే పనామెరా ఫీచర్లు గురించి మాట్లాడితే ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్‌లో 8-వే ఎలక్ట్రికల్‌గా అడ్జెస్టబుల్ సీట్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నావిగేషన్‌తో కూడిన పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ (PCM), స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

2024 పోర్షే పనామెరా హుడ్ కింద 2.9-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజిన్‌ను పొందుతుంది. ఈ పవర్‌ట్రెయిన్ 343 bhp శక్తిని మరియు 500 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు టూ-వే అడ్జస్టబుల్ రియర్ స్పాయిలర్‌ను కలిగి ఉంది. 270 కిమీ గరిష్ట వేగంతో కేవలం 4.8 సెకన్లలో 0-100 కిమీ నుండి వేగాన్ని అందుకుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News