భారతదేశంలో అనేక సేవింగ్ స్కీమ్స్ ఉన్నప్పటికీ, పోస్ట్ ఆఫీస్ స్కీంలకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అనేక ప్రాంతాల్లో పలువురు ఇప్పటికీ పోస్టాఫీస్ స్కీంలలో పెట్టుడులు చేస్తుంటారు. వీటిలో ఎలాంటి రిస్క్ ఉండదు. కాబట్టి అనేక మంది వీటిపై ఆసక్తి చూపిస్తారు.
ఈ పథకంలో కేవలం
అయితే ఈ రోజు మనం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీం గురించి తెలుసుకుందాం. మీరు ఈ పథకంలో కేవలం రూ. 1,000తో కూడా ఖాతాను ప్రారంభించవచ్చు. దీనిలో మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే నష్టమే ఉండదు. ఇది ఎలాంటి రిస్క్ లేకుండా, స్థిరమైన ఆదాయం పొందే మంచి స్కీం.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం ఏంటి?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) అనేది బ్యాంకులలో అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంతో సమానమైనది. దీనిలో పెట్టుబడి మొత్తం ఫిక్స్‌గా ఉండి, నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ TD పథకంలో 1, 2, 3, 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నందున, మీ పెట్టుబడి మొత్తం 100% భద్రతతో ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ TD పథకంలోని ముఖ్యమైన లక్షణాలు:
-కనీస పెట్టుబడి మొత్తం: రూ. 1,000
-గరిష్ట పరిమితి: ఏ పరిమితి లేదు
-1, 2, 3, 5 సంవత్సరాలకు డిపాజిట్ చేసే అవకాశం
-వడ్డీ రేట్లు: 6.9% నుంచి 7.5%
-వడ్డీ మూడు నెలలకు ఒకసారి చెల్లింపు
-సంపూర్ణ భద్రత గల పెట్టుబడి పథకం
Read Also: Best 5g Phones Under 10000: రూ. 10 వేల బడ్జెట్ లోపు టాప్ …
రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత లాభం వస్తుంది?
పోస్ట్ ఆఫీస్ TD పథకంలో 10 సంవత్సరాల కాలానికి మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. కాబట్టి, మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత లాభం పొందవచ్చో ఇక్కడ చూద్దాం:
-పెట్టుబడి మొత్తం: రూ.2,00,000
-కాల వ్యవధి: 10 సంవత్సరాలు
-వడ్డీ రేటు: 7.5%
-వచ్చే మొత్తం: రూ. 4,20,470
-మొత్తం వడ్డీ: రూ. 2,20,470
-అంటే మీరు 10 ఏళ్ల తర్వాత మీరు చేసిన పెట్టుబడి రూ. 2 లక్షలకు డబుల్ మొత్తాన్ని పొందవచ్చు.
పోస్ట్ ఆఫీస్ TD పథకంలోని వడ్డీ రేట్లు
పోస్ట్ ఆఫీస్ TD పథకంలో కాల వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి:
1 సంవత్సరం 6.9%
2 సంవత్సరాలు 7.0%
3 సంవత్సరాలు 7.1%
5 సంవత్సరాలు 7.5%
పోస్ట్ ఆఫీస్ TD పథకంలో ఖాతా ఎలా తెరవాలి?
పోస్ట్ ఆఫీస్ TD ఖాతాను ప్రారంభించడంలో ప్రక్రియ చాలా సులభం. కేవలం రూ. 1,000 తో ఖాతా తెరవవచ్చు. ఖాతా ప్రారంభించడానికి అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చిరునామా రుజువు (వాటర్ బిల్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్), ఫోటో వంటివి ఉండాలి.
పోస్ట్ ఆఫీస్ TD పథకంలోని ఇతర ప్రయోజనాలు
మీరు 5 సంవత్సరాల TD ఖాతాలో పెట్టుబడి పెడితే, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అన్ని వయస్సుల వారికి ఇది అనుకూలం. యువత నుంచి వృద్ధులు వరకు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలసి ఉమ్మడి ఖాతాను ప్రారంభించవచ్చు.