Child Names: పిల్లలకు అలాంటి పేర్లు పెడుతున్నారా..? అయితే వారికి జీవితాంతం కష్టాలేనట. శాస్త్ర విరుద్దంగా పేర్లు పెట్టడం వల్ల వారికి జీవితంలో నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి వారు జీవితంలో కష్టాలు అనుభవించాల్సి వస్తుందట. మరి ఎలాంటి పేర్లు పెట్టాలి..? పిల్లల భవిష్యత్తును బంగారుమయంగా మార్చే పేర్లు ఏవి..? జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లే నేమ్స్ ఏవీ..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పిల్లకు పేర్లు పెట్టేటప్పుడు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శాస్త్రోక్తంగా పేర్లు పెడితేనే పిల్లల భవష్యత్తు బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహాలు చూడాలి: పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో వారి గ్రహబలం చూడటం చాలా ముఖ్యమైనది. గ్రహాల ఆధారంగా వారికి సరిపోయే అక్షరంతో (పేరులో మొదటి అక్షరం) పేరు పెట్టాలట.
తిథి ద్వారా పేరు నిర్ణయించడం: ఇక పంచాంగంలోని పుట్టిన తిథిని అనుసరించి కూడా పేరు నిర్ణయం చేయాలని పండితులు సూచిస్తున్నారు. గ్రహబలం తర్వాత ముఖ్యమైనది తిథే అని చెప్తున్నారు.
రాశి నిర్ణయం: ఇక జన్మ జాతకం ద్వారా రాశిని నిర్ణయించిన తర్వాత రాశిని అనుసరించి కూడా పేరు పెట్టుకోవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. జన్మతిథి, జన్మరాశి ప్రకారం పేరు పెట్టుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అలా కాకుండా పేర్లు స్టైల్ గా ఉన్నాయి కదా అని ఏవి పడితే అవి పెడితే ఇబ్బందులు పడక తప్పదంటున్నారు.
పేర్లు పెట్టకూడదని తిథులు: కొన్ని తిథుల్లో పేర్లు అసలు పెట్టకూడదట. ఆ తిథుల్లో పేర్లు పెట్టడం వల్ల పిల్లలకు నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుందని దాని వల్ల ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుదని హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిలో అష్టమి, అమావాస్య, చతుర్ధశి తిథులలో పేర్లు అస్సలు పెట్టకూడదట.
ఆడపిల్లలకు పేర్లు ఎలా పెట్టాలి: ఆడపిల్లలకు ఎప్పుడైనా ఒకటి, మూడు, ఐదు అక్షరాలు అంటే బేసి సంఖ్యలు వచ్చే విధంగా పేర్లు పెట్టాలని సూచిస్తున్నారు. అప్పుడు ఆ ఆడబిడ్డలకు మంచి జరుగుతుందని చెప్తున్నారు.
మగపిల్లల పేర్లు ఎలా పెట్టాలి: ఇక మగ పిల్లలకు పేర్లు కూడా సరి సంఖ్యలో వచ్చేలా పెట్టాలని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా మగపిల్లల పేర్లు రెండు, నాలుగు, ఆరు ఇలా అంకెలు వచ్చేలా పెట్టాలని సూచిస్తున్నారు.
ఇక పిల్లలకు ఎప్పుడైనా దేవుళ్లు పేర్లు పెడితే చాలా మంచిది. కానీ నదుల పేర్లు, నక్షత్రాల పేర్లు మాత్రం అసలు పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే పిల్లలను పిలిచేటప్పుడు ముద్దు పేరుతో అసలు పిలవకూడదట. వారికి ఏ పేరైతే పెడతామో అదే పేరుతో పిలవాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం చెప్తుందంటే..?