Reliance Shares: స్టాక్ మార్కెట్ ఎప్పుడు, ఎవరిని మిలియనీర్లను చేస్తుందో చెప్పలేం. ఒక్క రోజు లోనే అనేక మంది ఎదిగిన వారు ఉన్నారు. అదే సమయంలో భారీగా నష్టపోయిన వారు సైతం కనిపిస్తారు. అయితే ఒక ప్రణాళిక ప్రకారం పలు కంపెనీల షేర్స్ కొనుగోలు చేసి దీర్ఘకాలంలో పెట్టుబడులు చేస్తే మాత్రం మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో కూడా అనేక మంది పలు కంపెనీలు భవిష్యత్తులో ఎదుగుతాయని భావించి, షేర్లను ఎప్పుడో కొనుగోలు చేసి మిలియనీర్లు, కోటీశ్వరులు అయిన వారు సైతం ఉన్నారు. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
చండీగఢ్‌కు చెందిన రత్తన్ దిల్లాన్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)షేర్ల కాపీ దొరికిందని, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ క్రమంలో తనకు స్టాక్ మార్కెట్ గురించి తెలియదని, ఈ షేర్లు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఎలా అని సహాయం కోరుతూ ప్రశ్నించారు. ఆ వ్యక్తి పోస్ట్ చేసిన చిత్రాలలో రిలయన్స్ షేర్లను 1988లో ఒక దానిని రూ.10 ధరకు కొనుగోలు చేసినట్లుగా కనిపిస్తుంది.
We found these at home, but I have no idea about the stock market. Can someone with expertise guide us on whether we still own these shares?😅@reliancegroup pic.twitter.com/KO8EKpbjD3
— Rattan Dhillon (@ShivrattanDhil1) March 11, 2025
దిల్లాన్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన అనేక మంది స్పందించడం ప్రారంభించారు. ఎందుకంటే అప్పట్లో రిలయన్స్ షేర్ల విలువ చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు రిలయన్స్ షేర్లు ప్రస్తుత మార్కెట్‌లో చాలా ఖరీదైనవిగా మారాయి. అంతేకాదు ఆ తర్వాత కంపెనీ బోనస్ షేర్లను అనేక సార్లు ప్రకటించింది. రత్తన్ దిల్లాన్ వద్ద మొదటగా 30 షేర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 863 షేర్లకు చేరుకుందని ఓ నెటిజన్ చెప్పారు. స్టాక్ విభజనల కారణంగా వాటి సంఖ్య కూడా పెరిగిందన్నారు.
Read Also: Employee Work Pressure: షాకింగ్ రిపోర్ట్.. తీవ్ర ఒత్తిడిలో 52% మంది ఉద్యోగులు..
అప్పుడు 30 షేర్ల కోసం రూ. 300 ఖర్చు చేయగా, ఇప్పుడు ప్రస్తుతం (మార్చి 12న) షేరు విలువ ప్రకారం చూస్తే ఒక్కొక్కటికి రూ. 1,255.95కు చేరాయని చెప్పవచ్చు. దీని ప్రకారం చూస్తే వాటి మొత్తం షేర్ల విలువ ఇప్పుడు రూ. 10.83 లక్షలకు చేరుకుంది. ఇది తెలిసిన అనేక మంది ఆయన పెట్టుబడి ధోరణిని మెచ్చుకుంటున్నారు. రత్తన్ స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన లేకుండానే, ఆ రోజుల్లోనే షేర్లు కొనుగోలు చేసి ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదించారని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలంటే ప్రముఖ సంస్థల్లో దీర్ఘకాల పెట్టుబడులు చేయడం చాలా కీలకమని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఇది చూసిన మరికొంత మంది ఆశ్చర్యపోతున్నారు.
దిల్లాన్ తన షేర్ల ధృవీకరణకు సంబంధించి గవర్నమెంట్ సంస్థ IEPFA (ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ) సహాయం తీసుకోవాలని ఓ నెటిజన్ సూచించారు. IEPFA వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి ఆ షేర్ల బదిలీ సహా పలు వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్ వినియోగదారులకు తప్పుగా లభించిన లేదా క్లెయిమ్ చేయని షేర్లను ట్రాక్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.