BigTV English

Liquor shops: మందుబాబులకు భారీ బ్యాడ్ న్యూస్.. ఆరోజు మందు కష్టమే..!

Liquor shops: మందుబాబులకు భారీ బ్యాడ్ న్యూస్.. ఆరోజు మందు కష్టమే..!

Liquor shops close: మందు బాబులకు భారీ బ్యాడ్ న్యూస్. ఈ నెల 14న హోళీ పండుగ రోజున మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ పేర్కొంది.


హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 14 న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూత పడనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ పలు కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా మద్యం షాపులు క్లోజ్ చేయాలని వైన్స్ నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు.  ఎవరైనా మద్యం సేవించి హంగామా సృష్టిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోళీ పండుగ రోజున బహిరంగంగా మద్యం సేవించినా, అల్లర్లకు కారణమైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు. బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై, సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లుతూ ఇబ్బందులకు గురిచేయొద్దని పేర్కొన్నారు.


హోలీ సందర్భంగా హైదరాబాద్‌ లో ఆంక్షలు: సీపీ అవినాష్ మహంతి

హోలీ వేడుకల్లో పాల్గొనే యువత ఇతరులకు ఎలాంటి సమస్యను సృష్టించరాదని.. ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు.  రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణికులపై, వాహనదారులపై రంగు వెదజల్లితే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హచ్చరించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి తెలిపారు.

ALSO READ: CERC Recruitment: డిప్లొమా, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు.. వేతనం అక్షరాల రూ.1,25,000.. రేపే లాస్ట్ డేట్

ALSO READ: Happy Holi 2025: ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుకున్న అసలు కథ ఏంటి?

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×