Bhuvneshwar Kumar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్…. టీమిండియాలో ఛాన్సులు రాక.. కనుమరుగు అయ్యారు. భువనేశ్వర్ కుమార్ ఒకానొక సమయంలో టీమిండియాలో ప్రధానమైన బౌలర్. పేస్ బౌలింగ్ విధానంలో భారత జట్టును ముందుండి నడిపించాడు. తన స్వింగ్ తో ప్రధాన జట్ల బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టించి చెమటలు పట్టించేవాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఇలా అన్ని రకాల వైవిధ్యమైన బంతులను వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు.
Also Read: Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ..వీడియో వైరల్
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్..నోరు మూసుకొని.. మేం చెప్పినట్టు వినండి?
అయితే ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఆ మధ్య రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా హింట్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అన్న పదాన్ని తొలగించాడు. ఇంతకుముందు అతని ఇన్ స్టా బయోలో ఇండియన్ క్రికెటర్ అని ఉండేది. భువనేశ్వర్ కుమార్ చివరిగా 2022 నవంబర్ 22న తన అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar ) సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ( Syed Mushtaq Ali Trophy ) కోసం సిద్ధమవుతున్నాడు.
Also Read: Shoaib Akhtar: అక్తర్ బౌలింగ్ దెబ్బకు సచిన్ పక్కటెముకలు విరిగిపోయాయి..?
ఈ ట్రోఫీలో కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్ జట్టును ( Uttar Pradesh ) అనౌన్స్ చేశారు. ఇందులో భువనేశ్వర్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ కెప్టెన్ గా ప్రకటించారు. గతంలో భువీ కి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ కు జట్టు పగ్గాలు అప్పగించారు. మొత్తంగా ఎనిమిది మ్యాచ్లలో కెప్టెన్ గా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీలో హైదరాబాద్ రెండుసార్లు విజయం సాధించింది.
Also Read: Cheteshwar Pujara: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆసీస్ కు చతేశ్వర్ పుజారా!
మరి ఇప్పుడు భువనేశ్వర్ సారథ్యంలో ఉత్తరప్రదేశ్ తన జట్టును ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. భువీ తన కెరీర్ లో 21 టెస్టులు ఆడాడు. 37 ఇన్నింగ్స్ లో 63 వికెట్లు తీశాడు. 121 వన్డేలు, 141 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 87 టీ20 ఇంటర్నేషనల్స్ లో 90 వికెట్లు తన ఖాతా లో వేసుకున్నాడు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ జట్టులో రింకూ సింగ్, నితీష్ రానా, యష్ దయాల్, పీయూష్ చావ్లా, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్ వేలానికి ముందు రింకు, యాష్ దయాల్ వంటి ఇతర ఆటగాళ్లను వారి జట్టులో ఉంచుకున్నాయి. కాగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ నవంబర్ 23న ప్రారంభమవుతుంది. అయితే.. లక్నో జట్టు.. వేలంలో భువిని కొనుగోలు చేయాలని అనుకుంటోంది. భువిని కొనుగోలు చేసి.. కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటోందట.