Gold Rate Today: ప్రస్తుతం పసిడి ధర అంతకంతకు పైకి పోతుంది. పసిడి ధరను పట్టుకునే అవకాశమే లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. రోజురోజుకు ధర పెరుగుతూ టెన్షన్ పెంచుతోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.99,600 వద్ద ట్రేడింగ్ లో ఉంది.
అయితే ఈ ధరలు పెరగడం ఇంకెంతో కాలం ఉండందంటున్నారు అంతర్జాతీయ వ్యాపార నిపుణులు. రాబోయే కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజమైతే రాబోయే రెండు నెలల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల 85 వేలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 98 వేలుగా ఉన్న ఈ ధర.. అమాంతం పడిపోతుందంటే కాస్త నమ్మేలా లేకపోయినా.. అదే జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
రాబోయే రెండు నెలల్లో బంగారం ధరలు 12 నుంచి 15 శాతం పడిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు రాబోయే రెండేళ్లలో అయితే బంగారం ధర ఏకంగా 38 శాతం పడిపోతుందని అమెరికాకు చెందిన పలు బిజినెన్స్ సర్వే కంపెనీలు చెబుతున్నాయి. వారు చెప్పినట్టుగా జరిగితే ప్రస్తుతమున్న ధరతో పోల్చితే బంగారం ధర 56 వేలకు చేరుతుంది.
మరోవైపు అంతర్జాతీయంగా ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే గోల్డ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ వార్‌తో పాటు.. అనేక దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్లంతా బంగారంవైపే మొగ్గు చూపుతున్నారు. వారికి ఇప్పుడు బంగారమే ఆప్షన్‌గా మారింది. దీంతో బంగారం డిమాండ్ పెరిగింది. అయితే ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై కూడా జరుగుతోంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. అందుకే ధరలు పడిపోయే అవకాశం ఉందంటున్నారు.
ధరలు తగ్గడానికి మరో కారణం కూడా చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 34 శాతం బంగారం ధరలు పెరిగాయి. దీంతో అమ్మకాలు భారీగా తగ్గాయి. గడచిన 15 రోజుల సంగతే చూసుకుంటే.. ఏకంగా 30 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఏకంగా 16 వందల కిలోల బంగారం తక్కువగా అమ్ముడుపోయింది. ఇది కూడా బంగారం ధర తగ్గేందుకు కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,300 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,300 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,600 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,600 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,750 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,300 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,600 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,600 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: తెలంగాణలో హ్యూండాయ్ భారీ ప్రాజెక్టు.. రూ8 వేల కోట్లతో పెట్టుబడి, ఆ కంపెనీ ప్రతినిధుల రాక
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,14,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,04, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.