E-Paper
Advertisement

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?
Advertisement

Banks New rules: బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని కట్టుదిట్టం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులు రోజువారీగా నిర్వహించాల్సిన క్యాచ్ రిజర్వ్ రేషియో-CRR కనీస నిల్వ నిబంధనను 90 శాతం నుంచి 99 శాతానికి పెంచడం కీలకమైంది. ఆర్బీఐ తీసుకున్న కొత్త నిబంధన అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రానుంది.

బ్యాంకులకు డబ్బుల కష్టాలు

సీఆర్‌ఆర్ లేకుంటే నగదు నిల్వ నిష్పత్తి అనేది బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత శాతం ఆర్‌బిఐ వద్ద నగదు నిల్వగా నిర్వహించాల్సిన మొత్తం. బ్యాంకులు సాధారణంగా మొత్తాన్ని రుణాలు ఇవ్వడానికి లేకుంటే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించలేవు. పాత నిబంధనల ప్రకారం బ్యాంకులు రెండు వారాలపాటు సగటున నిర్దేశిత CRRను కాపాడుకుంటూ రోజుకు కనీసం 90 శాతం నగదు నిల్వలు ఉండేలా చూసుకునే వెసులుబాటు ఉండేది. ఒక వారంలో తక్కువ నిల్వలు ఉన్నా, మరో వారంలో ఎక్కువగా ఉంటే సగటును మేనేజ్ చేసేవారు.

కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఆర్బీఐ

Advertisement

తాజా సవరణతో 99 శాతం క్యాష్ మెయింటైన్ చేయాలి. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు తమ రోజువారీ లిక్విడిటీ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నిర్ణయం వెనుక కారణం ఒక్కటే. అందుబాటులోవున్న డబ్బును అదుపులో ఉంచడమే. గడిచిన రెండు నెలల్లో విదేశీ మూలధన ప్రవాహాల బ్యాంకింగ్‌లోకి భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గతవారం జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వివిధ కారకాల వల్ల మిగులు లిక్విడిటీ లభ్యత తగ్గుతుందన్నారు. ఆర్‌బీఐ ఈ నిర్ణయం ద్వారా CRR శాతాన్ని పెంచలేదని, కేవలం రోజువారీ నిర్వహణ నిబంధనలను కఠినతరం చేసిందని చెబుతున్నారు.

ALSO READ: మీ కార్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐ పెరగబోతోందా? ఇలా తెలుసుకోండి

Advertisement

ఈ చర్య బ్యాంకింగ్ వ్యవస్థలో అందుబాటులో ఉన్న రోజువారీ లిక్విడిటీని నియంత్రించడానికి వీలవుతుందని అంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. దీనివల్ల పెద్దఎత్తున ద్రవ్య లభ్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ నుండి పెద్ద మొత్తంలో ద్రవ్యత బయటకు తరలిపోయే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు రూ.3.92 ట్రిలియన్ల అదనపు ద్రవ్యతను కలిగి ఉంది. ఆగస్టు చివరి ద్రవ్య విధాన సమావేశం నుంచి సగటు రోజువారీ నగదు మిగులు రూ. 5.9 ట్రిలియన్లుగా ఉండేది.

Related News

మీ కార్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐ పెరగబోతోందా? ఇలా తెలుసుకోండి

నెలకు రూ.2.28 లక్షలు ఆదాయం పొందుతున్న జొమాటో మాజీ ఉద్యోగి.. జాబ్ మానేసి ఏం చేస్తోందంటే

పండగల వేళ షాకిస్తున్న బంగారం ధర, పెంపు ఖాయమన్న బులియన్ వర్గాలు, మార్కెట్లో రేటు మాటేంటి?

తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన పనులు ఇవే!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

ఆటో డ్రైవర్ పిల్లల స్కూల్ ఫీజు రూ.1.5 లక్షలు.. భార్య ఎలా సాయం చేస్తోందంటే

Big Stories

Advertisement
×