PARXEN 10000 mAh power bank: రోజంతా బయట తిరిగే వారికి, ఆఫీస్ అంటూ బిజీగా ఉండే వారికి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చాలా ముఖ్యం. ఎంత పెద్ద బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్‌గా వాడితే చాలు, ఈవినింగ్ కల్లా డీప్ డిశ్చార్జ్ అయిపోతుంది. అలాంటి సమయంలో.. ఒక మంచి పవర్ బ్యాంక్ మన చేతిలో ఉంటే ఆ టెన్షనే ఉండదు. మార్కెట్లో ఎన్నో రకాల పవర్ బ్యాంకులు ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో స్లిమ్ లుక్ , పవర్‌ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అందించే ఈ మోడల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.ఈ గాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ పవర్ బ్యాంక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని డిజైన్. ఇది చాలా స్లిమ్‌గా, చాలా తక్కువ బరువుతో వస్తుంది. దీన్ని మనం ఈజీగా పాకెట్‌లో పెట్టుకోవచ్చు లేదా హ్యాండ్ బ్యాగ్‌లో సర్దుకోవచ్చు. దీనికి ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్ ఉండటం వల్ల ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి ఇది హ్యాండ్లింగ్ పరంగా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఇది పవర ఫుల్ 10,000 mAh లిథియం-పాలి మర్ బ్యాటరీ సెల్స్‌తో తయా రైంది. సాధారణంగా మార్కెట్లో .. లభించే సగం పవర్ బ్యాంకుల కంటే ఇవి చాలా సేఫ్ , ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అంతే కాకుండా దీని కెపాసిటీ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌ను ఈజీగా ఒకటి నుంచి రెండు సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా టాబ్లెట్లు, బ్లూ టూత్ ఇయర్ బడ్స్‌ను కూడా దీని ద్వారా ఛార్జ్ చేయెచ్చు.
Also Read: అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు
కాలం మారుతున్న కొద్దీ మనం వాడే గాడ్జెట్స్ కూడా ఫాస్ట్‌గా పని చేయాలని కోరుకుంటున్నాం. ఈ పార్జెన్ పవర్ బ్యాంక్ 22.5W (వాట్) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది. మీరు ఎమర్జెన్సీలో బయటికి వెళ్లే ముందు కొద్ది నిమిషాలు ఛార్జింగ్ పెట్టినా సరిపో తుంది.
ఈ పవర్ బ్యాంక్ అసలు ధర మార్కెట్లో సుమారు రూ. 4,199 వరకు ఉన్నప్పటికీ.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్‌లలో భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఆఫర్లు పోను ఇది కేవలం రూ. 599 ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న పవర్ బ్యాంక్ దొరకడం నిజంగా గొప్ప విషయ మనే చెప్పాలి.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. స్టైలిష్‌గా ఉండే పవర్ బ్యాంక్ కొనాలనుకునే వారికి .. ఈ మోడల్ పర్ ఫెక్ట్ ఛాయిస్. బ్యాటరీ డ్రైనేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే.. ఈ అఫోర్డబుల్ గాడ్జెట్‌ను మీ కార్ట్‌లో యాడ్ చేసుకోండి!