హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నటుడు మురళీమోహన్ ఒక పరిచయం లేని పేరు అని చెప్పవచ్చు. సినిమా రంగంలో కన్నా మురళీమోహన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోని ఎక్కువ పేరు సంపాదించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి నటుడు మురళీమోహన్ గతంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి రాకముందు సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవహారాల తల దూర్చి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి హీరో శోభన్ బాబు మురళీమోహన్ ను పిలిపించి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సినిమా రంగంలో సంపాదించిన డబ్బును ఏం చేస్తే సద్వినియోగం అవుతుందో సూచన చేశారు. ఎందుకంటే నటుడు శోభన్ బాబు అప్పటికే చెన్నై నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి పలు భూములను కొనుగోలు చేసి, ఆ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. చెన్నై నగరంలోని రియల్ ఎస్టేట్ దిగ్గజాలలో శోభన్ బాబు కూడా ఒకరు అంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే శోభన్ బాబు సంపాదించుకున్న ఈ పేరు రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఎంతో కఠినమైన శ్రమ క్రమశిక్షణ, ముందు చూపుతో పెట్టుబడి పెట్టడం వల్లే శోభన్ బాబు ఆ సక్సెస్ సాధించారు. అదే బాటలో మురళీమోహన్ సైతం హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి, చక్కటి విజయం సాధించారు.
అయితే ఈ సందర్భంగా మురళీమోహన్ తరచూ తనకు శోభన్ బాబు చెప్పిన సక్సెస్ సీక్రెట్ గురించి పలుమార్లు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. నిజానికి ఆ సక్సెస్ సీక్రెట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలోనూ తోడ్పడతాయని చెప్పవచ్చు. అలాంటి సీక్రెట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
>> ఒక పనిని 10 రకాలుగా చేస్తే సక్సెస్ మన సొంతం అవుతుందని తనకు శోభన్ బాబు చెప్పినట్లు మురళీమోహన్ పేర్కొన్నారు. దీని అర్థం 10 వ్యాపారాలు చేసే కన్నా, ఒకే వ్యాపారాన్ని 10 రకాలుగా ఆలోచిస్తూ దాన్ని ఎలా సక్సెస్ చేయాలో అడుగు వేసినట్లయితే కచ్చితంగా విజయం సాధిస్తామని తనకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలోనే వివిధ రకాలుగా వ్యాపారాన్ని విస్తరించినట్టు పేర్కొన్నారు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తో పాటు, కమర్షియల్ కాంప్లెక్స్, ప్లాట్స్ ఇలా విక్రయించి సక్సెస్ సాధించినట్లు పేర్కొన్నారు.
>> రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు కూడా అప్పు చేసి పెట్టుబడి పెట్టవద్దని శోభన్ బాబు తనకు చెప్పినట్లు మురళీమోహన్ పేర్కొన్నారు. ఇలాంటి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోకుండా అప్పులు చేయకుండా ఈ రంగంలోకి ప్రవేశించి నిలబడినట్లు పేర్కొన్నారు.
>> ప్రతి రూపాయి కి విలువ ఇవ్వాలి ఈ సూత్రం తాను శోభన్ బాబు దగ్గర నేర్చుకున్నట్లు మురళీమోహన్ పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత దానిపై వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెడుతూ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ తాను ఈ విజయం సాధించినట్లు మురళీమోహన్ పేర్కొన్నారు.
నిజానికి నటుడు శోభన్ బాబు చెప్పిన సూత్రాలు కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా రాణించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.