Realme 15T Smartphone: రియల్‌మీ మళ్లీ బడ్జెట్ ధరలోనే అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌తో మళ్లీ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించబోతోంది. రాబోయే రియల్‌మీ 15T ఇప్పటికే మొబైల్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 14T తర్వాత వచ్చే తదుపరి కొత్త మోడల్ ఇది. దానికి వారసుడిలా, మెరుగైన ఫీచర్లు, అప్‌డేట్‌లతో త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది.
లీక్ అయిన వివరాల ప్రకారం
ఈ ఫోన్ శక్తివంతమైన పనితీరు, పెద్ద బ్యాటరీ, స్మార్ట్ డిజైన్ కలిపి వినియోగదారుల కోసం అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు కోరుకునే వారిని ఇది బాగా ఆకట్టుకోనుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే
రియల్‌మీ 15Tలో సాధారణ ఫోన్ల కంటే పెద్ద పరిమాణంలో డిస్‌ప్లే, అది కూడా అమోలెడ్ (AMOLED) టెక్నాలజీతో ఉండబోతుందని అర్థం. ఈ ఫోన్‌లోని స్క్రీన్ స్పష్టత చాలా ఎక్కువగా ఉండటం వలన చిత్రాలు, వీడియోలు చిన్నచిన్న వివరాల వరకు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే స్క్రీన్ ప్రతి సెకనుకు ఎక్కువ ఫ్రేమ్‌లను చూపుతుంది. ఫోన్ స్క్రీన్ చుట్టూ ఉండే ఫ్రేమ్ చాలా పలుచగా ఉండటంతో, స్క్రీన్ పెద్దదిగా, విస్తారంగా కనిపిస్తుంది. డిజైన్‌లోనూ ప్రత్యేకత చూపించబోతున్నారు. ఫోన్ వెనుక వైపు కెమెరాలు ఒక చతురస్రం ఆకారంలో అమర్చబడి ఉండటం వల్ల ఫోన్ లుక్ ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Also Read: Airtel Offers: షాపింగ్ చేస్తే డబ్బులు వస్తాయా? ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్!
ఈ ఫోన్ ఆధునిక డిజైన్‌తో పాటు యువతను ఆకర్షించేలావ వివిధ రంగుల్లో మార్కెట్లోకి రానుంది. కేవలం కొన్ని మిల్లీమీటర్ల మందం, తక్కువ బరువుతో ఈ ఫోన్ స్లిమ్‌గా స్మూత్‌గా కనిపించనుంది. ఈ ఫోన్ స్పీడ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ అన్నింట్లోనూ మంచి నాణ్యత కలిగి ఉంది. ఈ ఫోన్‌లోని ప్రాసెసర్ కొత్త టెక్నాలజీ ఆధారంగా తయారు చేయబడింది కాబట్టి, సాధారణ పనులు మరింత వేగంగా పూర్తవుతాయి. ఈ ఫోన్‌లో ర్యామ్, స్టోరేజ్ వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి
రియల్‌మీ 15T బ్యాటరీ
బ్యాటరీ విభాగంలో కూడా రియల్‌మీ 15T పెద్ద అప్‌డేట్‌నే ఇవ్వబోతోంది. ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజులపాటు కూడా సులభంగా నడిచే శక్తివంతమైన బ్యాటరీని అందించనుంది. అంతేకాదు వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ కూడా కలిపి ఇవ్వనున్నారు. ప్యాక్‌లోనే అధిక సామర్థ్యం గల చార్జర్ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. రివర్స్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో ఇది వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది.
కెమెరా – వీడియో కాలింగ్ చేసే వారికి సౌకర్యం
కెమెరా విభాగంలోనూ బడ్జెట్ రేంజ్‌లో సరిపడా నాణ్యతను అందించనుంది. వెనుక వైపు ప్రధాన సెన్సార్‌తో పాటు అదనపు డెప్త్ సెన్సార్ కలిపి మంచి ఫోటోగ్రఫీ అనుభవం ఇస్తుంది. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా ఉండటం వలన సోషల్ మీడియా వినియోగదారులు, వీడియో కాలింగ్ చేసే వారికి సౌకర్యంగా ఉండనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌పై నడుస్తూ రియల్‌మీ ప్రత్యేక యూజర్ ఇంటర్‌ఫేస్ కలిపి యూజర్‌కు సులభమైన, వేగవంతమైన అనుభవాన్ని అందించనుంది.
రియల్‌మీ 15T ఒక ఆల్‌రౌండ్ ఫోన్
మొత్తానికి రియల్‌మీ 15T ఒక ఆల్‌రౌండ్ ఫోన్‌గా మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇవ్వడానికి సిద్ధమవుతోంది. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్ ప్యాకేజ్‌గా రాబోతోంది. రియల్‌మీ ఎప్పటిలాగే “తక్కువ ధర – ఎక్కువ ఫీచర్లు” అనే వ్యూహాన్ని కొనసాగిస్తోంది. దీంతో రియల్‌మీ 15T మార్కెట్‌లో మరోసారి విజయాన్ని సాధించే అవకాశం ఉంది.