Airtel Offers: ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ అనేది మనందరి జీవితంలో భాగమైపోయింది. ఇంట్లో కూర్చొని కావలసిన వస్తువులను ఒక్క క్లిక్‌తో కొనుగోలు చేసేందుకు అనువైన అనేక ప్లాట్‌ఫారమ్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సమయంలో షాపింగ్ చేయడమే కాకుండా, దానికి తోడు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అలా, వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్న టెలికాం కంపెనీలు, ఇప్పుడు ఎయిర్‌టెల్ ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ యాప్‌ను ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో ప్రధాన ఆకర్షణ ఫ్రీఛార్జ్ యూపీఐ. దీనిని ఉపయోగించి షాపింగ్ చేసే వారికి నేరుగా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ ఆఫర్ వివరాలు
మీరు Myntraలో షాపింగ్ చేసినప్పుడు, ఫ్రీఛార్జ్ యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే ఫ్లాట్ రూ.30 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది ఎటువంటి లాటరీ, డ్రా లేకుండా, నేరుగా అందే ప్రయోజనం. అంటే మీరు షాపింగ్ చేస్తే, వెంటనే మీ అకౌంట్‌లో రూ.30 క్రెడిట్ అవుతుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2025 వరకు కొనసాగనుంది. అంటే ఈ నెల చివరి వరకు ఎవరు షాపింగ్ చేసినా ఈ ప్రయోజనం పొందవచ్చు. నిజానికి రూ.30 అనేది చిన్న మొత్తం అనిపించినా, చాలా మంది కస్టమర్లను కలుపుకుంటే అది ఒక పెద్ద ఆకర్షణగా మారుతుంది.
Also Read: Jio Offers: జియో అన్‌లిమిటెడ్ ఆఫర్.. ఉచిత హోమ్ వైఫై షాకింగ్ ఆఫర్
చిన్న ట్విస్ట్ ఉందండోయ్..
అవును దీనికి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటంటే, దీన్ని పొందడానికి కొన్ని షరతులు కూడా ఉంటాయి. ముఖ్యంగా, మీరు తప్పనిసరిగా ఫ్రీఛార్జ్ యూపీఐ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ చేయాలి. వేరే పేమెంట్ ఆప్షన్లు ఎంచుకుంటే ఈ క్యాష్‌బ్యాక్ లభించదు. దీనిని వినియోగదారులు గమనించాల్సి ఉంటుంది.
వినియోగదారులకు చేరువగా ఎయిర్‌టెల్ యాప్..
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ప్రతి సంస్థా విభిన్న ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కూడా తన యాప్ ద్వారా వినియోగదారులను మరింతగా చేర్చుకోవాలని చూస్తోంది. ఎందుకంటే ఒకసారి కస్టమర్ ఒక యాప్‌ను ఉపయోగించడానికి అలవాటు పడితే, తర్వాతి రోజుల్లో కూడా అదే యాప్‌ను కొనసాగిస్తాడు. అందుకే ఇలాంటి క్యాష్‌బ్యాక్ స్కీమ్‌లు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక బ్యాంకులు, వాలెట్లు ఇలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఎయిర్‌టెల్ మాత్రం ప్రత్యేకంగా తన యాప్ ద్వారా ఇలాంటి బంపర్ ఆఫర్‌ను ప్రకటించడం వినియోగదారుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ముఖ్యంగా ఫ్రీఛార్జ్ యూపీఐని ఎక్కువ మంది ఉపయోగించేందుకు ఇది ఒక బలమైన ప్రోత్సాహం. ఎందుకంటే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ ఆప్షన్లు ఎక్కువగా వాడుతున్న సమయంలో, ఫ్రీఛార్జ్ యూపీఐని మళ్ళీ వినియోగదారుల ముందు నిలబెట్టాలనే ప్రయత్నంగా ఈ ఆఫర్ చూడొచ్చు. కాబట్టి సెప్టెంబర్ 30లోపు ఎవరికైనా మింట్రా (Myntra)లో షాపింగ్ చేయాలనే ఆలోచన ఉంటే, తప్పక ఫ్రీఛార్జ్ యూపీఐని ఉపయోగించడం మంచిదే. ఇలా చూస్తే, షాపింగ్‌ను మరింత మధురంగా మార్చే ఈ ఆఫర్, వినియోగదారులకు బంపర్ గిఫ్ట్‌లా మారింది.