BigTV English
Advertisement

Mad Square Collections : దారుణంగా పడిపోయిన ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Mad Square Collections : దారుణంగా పడిపోయిన ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Mad Square Collections : ఉగాది కానుకగా మార్చి 28న రిలీజ్ అయిన సినిమాలలో మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు నుంచి ఆరు రోజులు వరకు కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తుంది. ఐదు రోజులకు 80 కోట్ల వరకు వసూలు చేసిన ఈ మూవీ ప్రస్తుతం కలెక్షన్స్ డౌన్ అయినట్టు తెలుస్తుంది. ఐదు రోజులు పర్వాలేదనే టాక్ ను అందుకున్న ఈ మూవీకి ఆరో రోజు కలెక్షన్స్ బాగా డౌన్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఆరు రోజులకు మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు వసూల్ చేసిందో తెలుసుకుందాం..


2023 లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్.. అద్భుతమైన లవ్, కామెడీ, యూత్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఐదు రోజులు పూర్తయినా కూడా ఇప్పటికీ అదే జోరులో కలెక్షన్స్ ని రాబడుతుంది. ఆరో రోజు కాస్త తగ్గిన కలెక్షన్స్ ఏడో రోజు దారుణంగా పడిపోయినట్లు ఓ వార్త వినిపిస్తుంది. 5 వ రోజున 39 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఆరవ రోజు 22 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే దాదాపుగా సగానికి వసూళ్లు పడిపోయాయని టాక్.. అదే విధంగా ఏడో రోజు కూడా కలెక్షన్స్ పడిపోవడం గమనార్హం. ఏడో రోజు కేవలం 18 వేల టిక్కెట్స్ మాత్రమే అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది..

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది కానీ, ఓవర్సీస్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుకి చేరుకోలేదు. అయితే ఈ వారం తో బ్రేక్ ఈవెన్ అవుతుందని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. భారీగా కలెక్షన్స్ ని వసూలు చేస్తుందని ఆశపడ్డ యూనిట్ కి నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి టికెట్స్ రోజుకి పడిపోతున్నాయి. ఇక సినిమా 200 కోట్లు రాబడుతుందో లేదో చూడాలి..


Also Read: ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్స్ కురిపిస్తుంది. మొదటి రోజేవరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.17 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద రూ.28.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక మూడో రోజు వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను అందుకుంది. 4 వ రోజు రూ.6.25 కోట్ల నెట్ అందుకుంది. 5 వ రోజు 3 కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఆరో రోజు కూడా ఈ మూవీ 3.5 కోట్ల వరకు రాబట్టగా, ఏడో రోజు మాత్రం 3 కోట్లు కూడా రాలేదని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పకులు. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×