BigTV English

Suriya: సూర్య లవ్ ఎఫైర్ రివీల్ చేసిన కార్తీ.. ఫస్ట్ లవర్ జ్యోతిక కాదంటూ..?

Suriya: సూర్య లవ్ ఎఫైర్ రివీల్ చేసిన కార్తీ.. ఫస్ట్ లవర్ జ్యోతిక కాదంటూ..?

Suriya : కోలీవుడ్ స్టార్ హీరోగా, మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య (Suriya). రూ. వందల కోట్ల ఆస్తి ఉన్నా.. లక్షల్లో అభిమానులు ఉన్నా ఏ రోజు కూడా ఆడంబరాలకు పోకుండా.. సింప్లిసిటీతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయనలో ఈ క్వాలిటీస్ ను చూసి ఎక్కువగా అభిమానిస్తారు అనడంలో సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే సూర్యలో ఉన్న ఈ లక్షణాలను చూసే హీరోయిన్ జ్యోతిక (Jyothika) కూడా ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. 15 ఏళ్లకు పైగా చెన్నైలో సూర్య కోసం నివాసం అంటూ, తన కోరికలను, కలలను అణిచివేసుకున్న జ్యోతిక.. ఇప్పుడిప్పుడే నిర్మాణరంగంలోకి అడుగు పెట్టి, సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇన్నేళ్లుగా తనకోసం కష్టపడిన తన భార్యకు ఏదైనా చేయాలనుకున్న సూర్య.. ఆమె సంతోషం కోసం ఆమె బంధుమిత్రులు ఉండే ముంబైకు పిల్లలతో కలిసి షిఫ్ట్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే సూర్య తన భార్యపై ఎంతలా ప్రేమ కురిపిస్తారో అర్థం చేసుకోవచ్చు.


కంగువ మూవీతో ప్రేక్షకుల ముందుకు..

అయితే సూర్య.. జ్యోతిక కంటే ముందే మరో హీరోయిన్ ని ఇష్టపడ్డారట. అది కూడా సూర్య వన్ సైడ్ లవ్ అని, ఈ విషయాన్ని సూర్య తమ్ముడు కార్తీ(Karthi) రివీల్ చేశారు. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 14వ తేదీన ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఫస్ట్ రివ్యూ రాగా.. సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సూర్య..

ఇకపోతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable)కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు సూర్య. అలాగే సూర్య ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే సూర్య.. “మీ అభిమాన నటి ఎవరో రివీల్ చేయాలని ” బాలకృష్ణ అడిగారు. కానీ సూర్య సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇలా అయితే కుదరదని వెంటనే.. సూర్య తమ్ముడు కార్తీకి బాలకృష్ణ ఫోన్ చేశారు. జ్యోతిక కాకుండా సూర్యాకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని కార్తీ ని అడగగా.. కార్తీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టారు.

సూర్య ఫస్ట్ క్రష్ ఆమె..

సూర్య ఫస్ట్ క్రష్ ఒక హీరోయిన్.. ఆమె అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ గౌతమి (Gautami). ఆమె సినిమాలన్నా.. ఆమె అన్నా చాలా ఇష్టం. అయితే గౌతమిని అన్నయ్య వన్ సైడ్ లవ్ చేశారు. గౌతమి అన్నయ్య కంటే అయిదారేళ్ళు పెద్దది. కానీ ఏ రోజు కూడా అన్నయ్య తన ప్రేమ విషయాన్ని గౌతమికి చెప్పలేదు అంటూ తన అన్నయ్య ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేశారు కార్తీ. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×