BigTV English

Jio Unlimited Data Plan: రూ. 198కే జియో అన్ లిమిటెడ్.. 5జి ప్లాన్.. కానీ చిన్న ట్విస్ట్

Jio Unlimited Data Plan: రూ. 198కే జియో అన్ లిమిటెడ్.. 5జి ప్లాన్.. కానీ చిన్న ట్విస్ట్

Reliance Jio Introduces Unlimited 5G at Rs 198 for 14 Days: రిలయన్స్ జియో కస్టమర్లకు ముఖేష్ అంబానీ తీపి కబురు చెప్పారు. 5జీ స్పీడు, రోజు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 మెసేజ్ లు ఇలా వీటన్నింటితో ప్యాక్ చేసి రూ.198కే అందించనున్నారు. అలా జియో తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను పోర్ట్ ఫోలియో కి జత చేసింది. అంతే కాదు జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ ఇలా ఎన్నో అదనపు ప్రయోజనాలు అందనున్నాయి.


కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను  ప్రత్యర్థులు ఊహించని రీతిలో జియో ప్రకటించింది. ఈ ప్లాన్ ధర రూ. 198. అయితే 14 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది.  ఈ 14 రోజులు 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ డేటా చొప్పున 28 జీబీ డేటా, జియో ట్రూ ద్వారా  5జీ నెట్ వర్క్ పై అన్ లిమిటెడ్ డేటా తో పాటు కాలింగ్ ను కూడా అందిస్తోంది. తక్కువ వ్యవధిలో అధిక డేటా వినియోగ అవసరాలు ఉన్న వ్యక్తులకు ఈ రకమైన ప్లాన్ అనువైనది.

ఈ ప్లాన్ నిస్సందేహంగా జియో ప్రతి వినియోగదారునకు  సగటు అవసరాల్ని పెంచడంలో సహాయపడుతుంది. రూ. 200 లోపు కొత్త ప్లాన్ వినియోగదారులకు శుభవార్తని చెప్పాలి. ఇక వినియోగదారులు రూ.198,  రూ.199 ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.199 ప్లాన్ కొంచెం ఎక్కువ వాలిడిటీని కలిగి ఉందని చెప్పాలి.


Also Read: జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. మొత్తం ఎన్ని.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

వినియోగదారులు ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా తమ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.199 ప్లాన్‌కి 18 రోజుల సర్వీస్ వాలిడిటీ పీరియడ్ ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 మెసేజ్ లు, రోజుకు 1.5 జీబీ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లో అదనపు యాప్‌లుగా జియో టీవీ, జియో క్లౌడ్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మూడు నెలల అన్ లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కూడా జియో తన యూజర్ల కోసం అందించింది.

ఇకపోతే, జియో ఇటీవల అందించిన రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. రోజుకు 10 రూపాయల ఖర్చుతో అన్ లిమిటెడ్ లాభాలను అందిస్తోంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×