E-Paper
Advertisement

Reliance AI Investment: ఏఐ రంగంలో రిలయన్స్ రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. రానున్న ఏడేళ్లలో!

Reliance AI Investment: ఏఐ రంగంలో రిలయన్స్ రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. రానున్న ఏడేళ్లలో!
Advertisement

Reliance AI Investment: దిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుతో.. దేశ వ్యాప్తంగా ఏఐ పెట్టుబడులపై చర్చలు మొదలయ్యాయి. ప్రముఖ సంస్థ రిలయన్స్.. జియో ఏఐలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా AI విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి వచ్చే ఏడు సంవత్సరాలలో జియో ఏఐలో రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామన్నారు.

ఏఐతో ఖర్చు తగ్గించేందుకు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అలాగే సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఏఐ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు. కృత్రిమ మేధస్సు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన చెప్పారు. ఏఐ వాడకం విస్తృతంగా పెరిగినా..ఉద్యోగాలు తగ్గుతాయనే ఆందోళనలను కొట్టిపారేశారు. అందుకు బదులుగా కొత్తగా, ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఏఐ పని తీరును మారుస్తుందని అంబానీ అన్నారు.

Advertisement

ఏఐ పూర్తి క్వాలిటీ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. ఏఐ టెక్నాలజీ ఆర్థిక అవకాశాలను విస్తరిస్తూ “సూపర్ సమృద్ధి” యుగానికి నాంది పలికిందని అన్నారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందనే భయాలు తప్పు, ఎందుకంటే గత సాంకేతిక మార్పులు.. ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తూ కొత్త ఉపాధి మార్గాలను సృష్టించాయన్నారు.

డిజిటల్ కు ఏఐ ఊతం

దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీకి ఏఐ తోడైతే దేశానికి మరింత బలం చేకూరుతుందని ముఖేష్ అంబానీ చెప్పారు. ఏఐను మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ జియో.. భారతీయ వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఐఐటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయాలని యోచిస్తుందన్నారు. హై కంప్యూటింగ్ ఖర్చులు పరిమిత మౌలిక సదుపాయాలు ఏఐ విస్తరణకు కీలకమైన అడ్డంకులు అన్నారు. జియో ఇంటెలిజెన్స్ ఈ సవాళ్లను సావరిన్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Advertisement

Also Read:  చేతులు కలపని సీఈవోలు.. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికర సంఘటన

ఈ ప్రయత్నంలో భాగంగా, జామ్‌నగర్‌లో గిగావాట్-స్కేల్ డేటా సెంటర్‌లను నిర్మించాలని రిలయన్స్ యోచిస్తుంది. ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెడుతుందన్నారు.

Related News

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!

Big Stories

Advertisement
×