E-Paper
Advertisement

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!
Advertisement

E-Rickshaw Theft: కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ వచ్చే జీతంతో పాటు అదనపు ఆదాయం సంపాదించాలన్న టెక్కీ ఆలోచన అనూహ్యంగా బెడిసికొట్టింది. రూ. 1.75 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ-రిక్షాను.. తొలి రోజే చోరీకి గురైంది. దీంతో తల పట్టుకున్న టెక్కీ.. పోలీసులను ఆశ్రయించాడు. అదనపు ఆదాయం కోసం వేసిన ప్లాన్.. రివర్స్ అవ్వడంతో తీవ్వ ఆవేదనకు గురయ్యాడు.

అసలేం జరిగిందంటే?

కార్పొరేట్ రంగంలో దాదాపు 12 ఏళ్ల అనుభవం ఉన్న బాధిత ఇంజనీర్ కు అదనపు రాబడి కోసం ఓ మార్గం కనిపించింది. ఆఫీసులోని ప్యూన్ ఇచ్చిన సలహా మేరకు ఒక ఈ-రిక్షా కొనుగోలు చేసి దానిని వేరొకరికి అద్దెకు ఇస్తే రోజూ రూ. 500 నుండి రూ. 700 వరకు సంపాదించవచ్చని భావించాడు. దీనివల్ల తన సొంత ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా ప్రతిరోజూ స్థిరమైన ఆదాయం వస్తుందని నమ్మాడు.

తొలి రోజే ఊహించని షాక్

Advertisement

డ్రైవర్ కోసం ప్యూన్ అడగ్గా.. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తిని అతడు సిఫార్సు చేశాడు. ప్యూన్ మాటలపై నమ్మకంతో రూ. 1.75 లక్షలతో కొత్త ఈ-రిక్షా కొని రోజుకు రూ. 600 అద్దె ఇచ్చేలా సదరు డ్రైవర్‌కు అప్పగించాడు. అయితే వాహనంతో బయటకు వెళ్లిన ఆ డ్రైవర్ తిరిగి రాలేదు. మొదటి రోజే వాహనంతో సహా మాయమయ్యాడు. ఘటన జరిగి 15 రోజులు గడిచినా అతని జాడ గానీ, ఈ-రిక్షా సమాచారం గానీ లభించలేదు.

Also Read: ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

నెటిజన్ల స్పందన ఇదే!

Advertisement

ఈ ఉదంతాన్ని గౌరవ్ తోమర్ అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ’12 ఏళ్ల కార్పొరేట్ అనుభవం ఉన్న ఇంజనీర్ ఇంత అమాయకంగా ఎలా ఆలోచించాడు?’ అని గౌరవ్ ప్రశ్నించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘అదనపు రాబడి ఆలోచన మంచిదే అయినప్పటికీ అమలు చేయడంలోనే పొరపాటు జరిగింది’ అని అభిప్రాయపడ్డారు. డ్రైవర్‌కు ఇచ్చే ముందు కనీసం ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, గుర్తింపు కార్డులు, చిరునామా ఆధారాలు తీసుకోలేదా? అని పలువురు ప్రశ్నించారు. ప్రస్తుతం బాధితుడు తన వాహనం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. జరిగిన మోసంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

Tags

Related News

ఒక్కసారిగా రివర్స్ అయిన బంగారం ధర.. మార్కెట్లో ధరలు చూద్దాం.

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

దలాల్ స్ట్రీట్‌లో బేర్ విహారం.. గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల ఆవిరి, ఎందుకిలా?

పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

‘నో యూపీఐ డే’ నిరసనపై వెనక్కి తగ్గిన ట్రేడర్స్.. మంత్రి నిర్మల భేటీలో ఏం జరిగింది?

పండగ సీజన్ వేళ సామాన్యుడికి షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. ఏకంగా రూ. 62.50 పెంపు

వాట్సాప్‌ మెసేజ్‌లు ఇక ఉచితం కాదు.. అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే

Big Stories

Advertisement
×