E-Paper
Advertisement

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
Advertisement

Homebuying Survey 2026| ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన నిర్ణయం. అయితే, ప్రస్తుతం కొనుగోలుదారులు ధర మాత్రమే కాకుండా అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. కొత్త ఇంటి కోసం చూస్తున్నవారు ప్రాంతం, కనెక్టివిటీ, ఇంటి పరిమాణం, సౌకర్యాలు, నిర్మాణ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రియల్ స్టేట్ కంపెనీ కొల్లీర్స్ చేపట్టిన తాజా సర్వే ప్రకారం.. ఇల్లు కొనాలని ప్లానింగ్ చేస్తున్న దాదాపు సగం మంది బయ్యర్స్ వచ్చే రెండేళ్లలో ఇల్లు కొనాలని భావిస్తున్నారు.

వచ్చే రెండేళ్లలో ఇల్లు కొనాలని భావిస్తున్న సగం మంది

కొల్లీర్స్ కంపెనీ 2026 సర్వేలో 1,800 మంది పాల్గొన్నారు. ఈ సర్వే 30కి పైగా అభివృద్ధి చెందిన, చెందుతున్న రెసిడెన్షియల్ ప్రాంతాల్లో జరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది వచ్చే రెండేళ్లలో ఇల్లు కొనాలని భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, 54 శాతం మంది దాని ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. సొంత ఇంటిపై ఆసక్తి కూడా కొనసాగుతోంది. సుమారు 51 శాతం మంది తమ నివాసం కోసం ఇల్లు కొనాలని భావిస్తున్నారు.

ఇంటి ధరే ప్రధాన అంశం

Advertisement

ఇల్లు కొనేటప్పుడు ధర ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది. సుమారు 31 శాతం మంది ధర, అందుబాటు తమ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
ఉద్యోగ భద్రత, ఆదాయంపై నమ్మకం కూడా కొనుగోలుదారులకు ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. ఇంటి పరిమాణం, గదుల అమరిక, సామాజిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కూడా ప్రాధాన్యత పొందుతున్నాయి. సుమారు 75 నుంచి 80 శాతం మంది ఈ అంశాలను ముఖ్యమైనవిగా భావించారు.

2BHK లేదా 3BHKలకు ఎక్కువ ప్రాధాన్యం

సర్వే ప్రకారం.. 62 శాతం మంది బయర్స్ రెండు లేదా మూడు బెడ్‌రూమ్ ఇళ్లను కోరుకుంటున్నారు. అయితే నగరాన్ని బట్టి వారి ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో పెద్ద ఇళ్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ముంబైలో మాత్రం సరైన పరిమాణంలో ఉన్న కాంపాక్ట్ ఇళ్లకు ఎక్కువ ఆసక్తి ఉంది. సుమారు 46 శాతం మంది రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లను కోరుకుంటున్నారు.

సిద్ధంగా ఉన్న ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

Advertisement

60 శాతానికి పైగా కొనుగోలుదారులు రెడీ టు మూవ్ లేదా నిర్మాణం పూర్తి కావొస్తున్న ఇళ్లను ఇష్టపడుతున్నారు. కొత్తగా ప్రారంభించిన లేదా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులపై వారికి తక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ఇంటిని ముందుగానే చూడాలని, నిర్మాణ నాణ్యతను అర్థం చేసుకోవాలని బయ్యర్స్ కోరుకుంటున్నారు. అలాగే ఇల్ల చేతికి ఎప్పుడు వస్తుందో స్పష్టంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు.

Also Read: ఇతర బ్యాంకులో తక్కువ వడ్డీకి హోమ్ లోన్.. మీ బ్యాంకు నుంచి లోన్ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఇది తెలుసుకోండి

నిర్మాణ రిస్క్‌ ఎక్కువగా స్వీకరిస్తున్న యువ కొనుగోలుదారులు

30 ఏళ్లలోపు కొనుగోలుదారుల్లో సుమారు సగం మంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రారంభ దశలో ఇళ్లు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉండటం దీనికి ఒక కారణం కావచ్చు. 30 ఏళ్లు దాటిన వారిలో 36 శాతం మంది మాత్రమే ఇలాంటి రిస్క్‌కు సిద్ధంగా ఉన్నారు. వీరు వేగంగా స్వాధీనం పొందే, స్పష్టత ఉన్న ఇళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Also Read: 31 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష.. కోర్టు విచిత్ర తీర్పు

ప్రాంతం, సౌకర్యాలు

గేటెడ్ కమ్యూనిటీలలో భద్రతా సదుపాయాలకు కొనుగోలుదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత పచ్చని ప్రదేశాలు, ఓపెన్ స్పేస్‌లు, కమ్యూనిటీ సౌకర్యాలకు ఆసక్తి చూపుతున్నారు. యువ కొనుగోలుదారులు ఫిట్‌నెస్, వెల్‌నెస్ సౌకర్యాలను కూడా ఎక్కువగా కోరుకుంటున్నారు. మొత్తంగా చూస్తే, ధరతో పాటు నాణ్యత, ప్రాంతం, సౌకర్యాలు, కనెక్టివిటీ, ఇల్లు స్వాధీనం, కీలకంగా మారుతున్నాయి.

Also Read: ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

Tags

Related News

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!

ఒక్కసారిగా రివర్స్ అయిన బంగారం ధర.. మార్కెట్లో ధరలు చూద్దాం.

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

దలాల్ స్ట్రీట్‌లో బేర్ విహారం.. గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల ఆవిరి, ఎందుకిలా?

పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

‘నో యూపీఐ డే’ నిరసనపై వెనక్కి తగ్గిన ట్రేడర్స్.. మంత్రి నిర్మల భేటీలో ఏం జరిగింది?

Big Stories

Advertisement
×