BigTV English

RBI Monetary Policy: రెపో రేట్ లో ఏ మార్పు ఉండదు.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

RBI Monetary Policy: రెపో రేట్ లో ఏ మార్పు ఉండదు.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

RBI Monetary Policy| రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ గురువారం రెపో రేట్ 6.5 శాతంగా నిర్ధారించింది. మానిటీరీ పాలసీ కమిటీ మీటింగ్ లో ఆర్ బిఐ గవర్నర్ శక్తి కాంతా దాస్ ఈ రెపోరేట్ లో ఏ మార్పు ఉండదని.. తొమ్మిది నెలలుగా 6.5 శాతంగా ఉంచామని తెలిపారు.


మానిటరీ పాలసీ మీటింగ్ ప్రతి రెండు నెలల కోసారి జరిగుతుంది. గురువారం జరిగిన మీటింగ్ లో రెపో రేట్ మార్చకూడదని ఆరుగురు సభ్యులన్న కమిటీ నలుగురు నిర్ణయించినట్లు గవర్నర్ వెల్లడించారు. పైగా ప్రజల లో మనీ సప్లై తగ్గించేందుకు (విత్‌డ్రాయల్ ఆఫ్ అకామడేషన్) చర్యలు తీసుకుంటామని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ పాలసీలకు అనుగుణంగా భారత మార్కెట్ పుంజుకుంటోందని.. అందుకే రెపో రేట్ లో మార్పు చేయలేదని గవర్నర్ దాస్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచదేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండడం చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడం, నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో రిజర్వ్ బ్యాంకు 2024-25 ఆర్థిక సంవత్సారానికి 4.5 శాతం ద్రవోల్బణం కుదించింది.


ప్రస్తత ఆర్థిక సంవత్సరంలోని రెండు, మూడు, నాలుగో త్రైమాసికం ద్రవ్యోల్బణ రేటు 4.4 శాతం, 4.7 శాతం, 4.3 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. జూన్ లో జరిగిని మానిటరీ పాలసీ మీటింగ్ లో ఈ అంచనాలు 3.8 శాతం, 4.6 శాతం, 4.5 శాతంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని.. అందుకుగాను ద్రవ్యోల్బణ రేటు 4 శాతానికి టార్గెట్ చేస్తున్నామని గవర్నర్ దాస్ వివరించారు. భారత దేశ ఎకానమీ 2025 ఆర్థిక సంవత్సరానికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరాంలో భారత ఎకానమీ 8.2 శాతం వృద్ధి నమోదు చేసింది.

నిత్యావసరాల ధరల నియంత్రణ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకుకు ఒక సవాల్ గా మారింది. దీంతో కీలక వడ్డీ రేటు (రెపో రేటు)ని మార్పు చేయకుండా 6.5 శాతానికే నిర్ధారించారు.

Also Read: పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది.. మరి బంగారం ధరల మాటేంటి ?

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×