BigTV English
Advertisement

Angel of Nanjing: 469 మందిని ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడిన హీరో ఇతనే.. ఇదంతా ఎలా చేశాడంటే..

Angel of Nanjing: 469 మందిని ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడిన హీరో ఇతనే.. ఇదంతా ఎలా చేశాడంటే..

Angel of Nanjing| అతను గత 21 ఏళ్లుగా బాధలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు. వారు ఆత్మ హత్యలు చేసుకోకుండా అడ్డుపడుతున్నాడు. అతని పేరు చెన్ సీ. చైనాలోని యాంగ్ జె నదిపై నిర్మించిన వంతెనపై ఆత్మహత్యలు చేసుకోవాలని వచ్చేవారిని అడ్డుకునే వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నాడు.


ఎర్ర యూనిఫామ్ ధరించి ప్రతిరోజు నదిపై ఉన్న బ్రిడ్జిపై పది గంటలు డ్యూటీ చేస్తుంటాడు. 56 ఏళ్ల చెన్ సీ.. 21 ఏళ్లుగా ఈ ఉద్యోగం చేస్తూ.. మొత్తం 469 ఆత్మహత్యలు నివారించాడు. యాంగ్ జె నది బ్రిడ్జిపై ఎవరైనా ఒంటరిగా వస్తే.. వారిని చెన్ సీ గమనిస్తూ ఉంటాడు. వారి ముఖంలో బాధ, నిరుత్సాహ వంటివి చూసి.. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి వారితో స్నేహ పూర్వకంగా ఏవో మాటలు మాట్లాడుతాడు. జీవితంలో విజయ – పరాజయాలు, సామాన్యమని.. తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలని.. వారికి సమాజంలో ఎవరైనా అన్యాయం చేస్తే.. పోరాడాలి లేదా క్షమించాలని సలహాలిస్తుంటాడు.

చాలామంది చెన్ సీ మాటలు వినకుండా తొందరపడి బ్రిడ్జిపై నుంచి దూకడానికి ప్రయత్నించినప్పుడు వారిని బలపూర్వకంగా పట్టుకొని వెనక్కు లాగిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇదంతా చెన్ సీ ఏదో ఉద్యోగం కోసం చేయడం లేదు. 2000 సంవత్సరంలో చెన్ సీ మొదటిసారి ఒక టీనేజ్ అమ్మాయిని ఆ బ్రిడ్జిపై అటు ఇటూ కంగారుగా నడవడం చూశాడు. చెన్ సీ కి ఆమె ఏదో సమస్యలో ఉన్నట్లు అనిపించి.. అమ్మాయి తో మాట్లాడడానికి వెళ్లాడు. ఆమెతో మాట్లాడితే తెలిసింది, తన వద్ద డబ్బులు లేవని, ఆమె రెండు రోజులుగా ఏమీ తినలేదని. ఇదంతా విని చెన్ సీ ఆమె కోసం భోజనం తెచ్చాడు. ఆ తరువాత ఆమె గ్రామానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేశాడు. ఆ రోజు ఆ అమ్మాయి ఆ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకో బోతుండగా.. చెన్ సీ ఆపడం అదే తొలిసారి. ఈ సంఘటన తరువాత చెన్ సీ కి ఒక ఆలోచన వచ్చింది. కేవలం చిన్న సహాయంతో ఆత్మహత్యలు జరగకుండా ఆపవచ్చని.


చెన్ సీ గురించి తెలుసుకొని స్థానిక మీడియా సంస్థ సౌత్ చైనా పోస్ట్ అతడిని ఇంటర్ వ్యూ చేసింది. ఇంటర్ వ్యూ లో చెన్ మాట్లాడుతూ.. ”బ్రిడ్జిపై ఒంటరిగా తిరిగే చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను. వాళ్లు ఏదో ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తే.. వారి వద్దకు వెళ్లి.. ముందు రిలాక్స్ గా ఉండండి.. జీవితాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. కష్టాలు ఉంటే వాటిని ఎదుర్కోవచ్చు అని వారిలో ధైర్యం నింపుతూ ఉంటాను. పైగా నేను ఆ సమయంలో వారిని ఆపినంత మాత్రాన వారు ఆగరు. అందుకే వారి సమస్యను పూర్తిగా వింటాను. వీలైతే వారి సమస్య పరిష్కరించడానికి నా మిత్రులతో కలిసి ప్రయత్నిస్తాను” అని అన్నాడు.

కేవలం గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు వంద మందికి పైగా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయత్నించారని ఆయన తెలిపాడు. వాళ్లను ఆదుకోవడానికి చాలా సార్లు తన సొంత డబ్బులను ఖర్చు చేశాడని చెప్పాడు. ఇలాగే ఒక అమ్మాయి తన కాలేజీ ఫీజు కోసం డబ్బులు లేవని బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. చెన్ సీ తన మిత్రుల వద్ద నుంచి 1400 డాలర్లు సేకరించి ఆ అమ్మాయికి సహాయం చేశాడు. మరో ఘటనలో ఒక మహిళ తన భర్త తనను మోసం చేశాడని మానసికంగా బాధపడుతూ బ్రిడ్జిపై నుంచి దూకపోతే చెన్ సీ ఆమెను చాలా కష్టపడి కాపాడాడు.

చెన్ సీ లాంటి వ్యక్తులు మన సమాజానిక ఓ ఆదర్శం. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలా మంది స్వార్థంగా జీవిస్తున్న ఈ ప్రపంచంలో.. ఇతరులు బాధలో ఉంటే వారిని ఆదుకోవాలని.. సాటి మనిషి కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయాలని చెన్ సీ జీవితం నుంచి అందరూ నేర్చుకోవాలి.

Also Read: ‘బంగ్లాదేశ్ అల్లర్లలో ఆర్మీ హస్తం’.. అంతర్జాతీయ మీడియా కథనం!

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×