నిజమైన విద్య పాఠశాలలో కాదు, జీవితంలో నేర్పుతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ వైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ క్రమంలో భారీ మాంద్యం (Recession) ముంచుకొస్తుందని హెచ్చరిస్తూనే… మరోవైపు ఈ సంక్షోభం సమయంలో ధనవంతులు అయ్యేందుకు అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు.
కొత్త ఆర్థిక మార్గం
అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ, డాలర్ విలువ, షేర్ మార్కెట్లు all are walking on a tightrope. ఈ అస్తవ్యస్త సమయంలో మామూలు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు కియోసాకి. ఎందుకంటే సంక్షోభాలే అసలు సంపత్తిని పెంచుకునే అసలు కాలమని, ఒక కొత్త ఆర్థిక మార్గాన్ని ఆయన సూచించారు. సంపదల కోసం నలుగురినీ బతిమిలాడే రోజులు పోయాయని, ఇప్పుడు జ్ఞానంతో ప్లాన్ చేస్తే ఎవరికైనా రిచ్ డాడ్ కావచ్చని ఆయన వెల్లడించారు. ఇక ఆయన సూచించిన ఆ “కొత్త సూత్రం” ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా ఆర్థిక సంక్షోభం
2025లో అమెరికా ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని కియోసాకి సోషల్ మీడియా X ఖాతాలో పోస్ట్ చేసి పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ అప్పు గణనీయంగా పెరిగింది. జాతీయ అప్పు స్థాయి గతంలో కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు నిరుద్యోగం తగ్గడం లేదు, అమెరికన్లు వారి పొదుపు ఖాతాలలో డబ్బును కోల్పోతున్నారు. పెన్షన్‌లు దొంగిలించబడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా మాంద్యం వైపు వెళుతోందని కియోసాకి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Poxiao: బియ్యపు గింజత హార్డ్ డ్రైవ్..రెప్పపాటులో డేటా ట్రాన్స్ …
ధనవంతులు కావడానికి కియోసాకి సూత్రం
ఈ ఆర్థిక సంక్షోభంలోనూ అవకాశాలు ఉన్నాయని కియోసాకి గుర్తు చేశారు. మాంద్యం తర్వాత చాలా మంది “కొత్త ధనవంతులు”గా ఉద్భవిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు. ఈ ఆస్తుల ధరలు రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరుగుతాయని ఆయన అంచనా వేశారు.
ధరల అంచనాలు:
బిట్‌కాయిన్: ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర $85,000 ఉంది. 2035 నాటికి ఇది $1 మిలియన్‌ను అధిగమిస్తుందని కియోసాకి జోస్యం చెప్పారు.
గారం: ప్రస్తుతం ఔన్సుకు $3,300 ఉన్న బంగారం ధర, రాబోయే దశాబ్దంలో ఔన్సుకు $30,000కు చేరుకుంటుందని అంచనా.
వెండి: ప్రస్తుతం ఔన్సుకు $32 ఉన్న వెండి ధర, 2035 నాటికి ఔన్సుకు $3,000కు చేరుకుంటుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.
రాబోయే దశాబ్దం కీలకం
రాబోయే 10 సంవత్సరాలు ఆర్థికంగా చాలా కీలకమైనవని కియోసాకి అభివర్ణించారు. సంప్రదాయ ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడకుండా, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవచ్చని ఆయన సూచించారు.
మీరు ఏమనుకుంటున్నారు..
కియోసాకి హెచ్చరికలు, అంచనాలు ఆర్థిక పెట్టుబడిదారులకు, సామాన్య ప్రజలకు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి, ధనవంతులు కావడానికి ఆయన సూచించిన మార్గాల గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.