BigTV English

India : రూ.500 నోట్లు రద్దు!.. కేంద్రం ఏం చెప్పిందంటే..

India : రూ.500 నోట్లు రద్దు!.. కేంద్రం ఏం చెప్పిందంటే..

India : 2026 నాటికి కొత్త రూ.500 కరెన్సీ నోట్లు రద్దు కానున్నాయి. దేశంలో అవినీతి, బ్లాక్ మనీని అరికట్టేందుకు.. మరోసారి పెద్ద నోట్లు రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏడాదికల్లా ప్రస్తుతం చెలామణిలో ఉన్నా 500 నోట్లను క్యాన్సిల్ చేస్తారని తెలుస్తోంది. ఇలా కొంతకాలంగా రకరకాల న్యూస్ వైరల్ అవుతోంది. పెద్ద నోట్ల రద్దుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్‌లో ఎవరికి తోచిన విధంగా వాళ్లు వీడియోలు చేస్తున్నారు. వెబ్‌సైట్లలోనూ అలాంటి వార్తలే వస్తున్నాయి. మరి ఏది నిజం? నిజంగానే రూ.500 నోట్లు రద్దు అవుతాయా?


రూ.500 నోట్లు రద్దు?

లేటెస్ట్‌గా జూన్ 2న ‘క్యాపిటల్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానల్ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో రూ.500 నోట్లు వచ్చే ఏడాది మార్చి నుంచి రద్దు అవుతాయని ఉంది. ఆ వీడియో కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. క్యాపిటల్ టీవీ అనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక యూట్యూబ్ ఛానెల్స్‌లో అలాంటి వార్తనే కనిపిస్తోంది. తెలుగులోనూ బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. అది చూసి ప్రజల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. రూ.500 నోట్లు దాచుకోవాలా వద్దా? రద్దు చేస్తే మునుపటిలా ఇబ్బంది పడాల్సి వస్తుందనే టెన్షన్ మొదలైంది.


రూ.500 నోట్లపై చర్చ..

ఆనాటి వెయ్యి నోటు రద్దు తర్వాత తీసుకొచ్చిన 2వేల నోట్లను భద్రంగా దాచుకున్నారు చాలామంది. అవినీతిపరులైతే గులాబీ రంగు 2వేల నోట్లను కట్టలకు కట్టలు కూడబెట్టారు. అంతలోనే ఆ కొత్త 2వేల నోట్లను కూడా విత్‌డ్రా చేస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకూ కూడబెట్టిందంతా ఒక్క రోజులోనే ఫసక్ అంది. ఆ తర్వాత రూ.500 నోట్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఉన్న పెద్ద నోటు అదే కదా. వాటినీ బ్లాక్ చేసేస్తున్నారు పన్ను దొంగలు. అందుకే, మళ్లీ రూ.500 నోట్లను కూడా క్యాన్సిల్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అంతా ఫేక్ ప్రచారం..

అయితే, అదంతా అబద్ధం. 2026 నుంచి రూ.500 నోటును రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైతం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టం చేసింది. క్యాపిటల్ టీవీలో వచ్చిన ఆ వార్తను.. భారత ప్రభుత్వ అధికారిక వాస్తవ తనిఖీ సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సైతం ఫ్యాక్ట్ చెక్ చేసింది. రూ.500 నోట్లు రద్దు చేయబడలేదని.. అవి చట్టబద్ధమైనవేనని చెబుతో ఎక్స్‌లో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. తప్పుడు సమాచారంతో ప్రజలు మోసపోవద్దని, భయాందోళన చెంద వద్దని సూచించింది.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×