Monsoon Skin Care: వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇది అనేక చర్మ సమస్యలను కూడా అందిస్తుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో వాతావరణంలో అధిక తేమ, ధూళి కారణంగా.. మొటిమలు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు , చర్మంపై జిడ్డు వంటి సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో.. కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించడం కూడా చాలా ముఖ్యం.
ఈ సీజన్‌లో చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా, ప్రకాశవంతంగా ఉంచడానికి కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఉపయోగపడే 5 సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటి సహాయంతో ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవసరమే లేకుండా కూడా మీరు మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 చిట్కాలు:
ఫేస్ వాష్ వాడకం:
వర్షాకాలంలో.. చెమట, తేమ ముఖం మీద మురికి, నూనె పేరుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిలో, రోజుకు రెండుసార్లు తేలికపాటి, సల్ఫేట్ లేని ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగడం ముఖ్యం. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మొటిమలు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీకు జిడ్డు చర్మం ఉంటే.. జెల్ ఆధారిత ఫేస్ వాష్‌ను తప్పకుండా ఉపయోగించండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతూ కాకుండా మంచి ఫలితాలను కూడా అందిస్తుంది.
మాయిశ్చరైజ్ :
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. కానీ దానికి అర్థం తేమ అవసరం లేదని కాదు. టోనర్ చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా మాయిశ్చరైజర్ తేమను సమతుల్యం చేస్తుంది. కాబట్టి, ఖచ్చితంగా ఆల్కహాల్ లేని టోనర్, మంచి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి.
సన్‌స్క్రీన్ అప్లై చేయడం :
వర్షాకాలంలో చాలా మంది సన్‌స్క్రీన్ అప్లై చేయడం మానేస్తారు. ఇది తప్పు. ఈ సీజన్ లో కూడా UV కిరణాలు మేఘాల గుండా వెళ్లి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే.. ఈ సీజన్‌లో కూడా కనీసం SPF 30 ఉన్న వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ అప్లై చేయడం తప్పనిసరి. ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు.
ఎక్స్‌ఫోలియేట్ చేయడం :
వర్షాకాలంలో డెడ్ స్కిన్ సెల్స్ త్వరగా పేరుకుపోతాయి. ఇది ముఖంపై గరుకుదనాన్ని, అంతే కాకుండా బ్లాక్ హెడ్స్‌ను పెంచుతుంది. వారానికి 1-2 సార్లు తేలికపాటి స్క్రబ్‌తో ముఖంపై ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తాజాగా, మృదువుగా చేస్తుంది.
ఫేస్ ప్యాక్‌లతో సహజమైన మెరుపు:
ఈ సీజన్‌లో.. రసాయన ఉత్పత్తుల కంటే హోం రెమెడీస్ మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి. ముల్తానీ మిట్టి, వేప పొడి, రోజ్ వాటర్ లేదా అలోవెరా జెల్ వంటి సహజ ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని డీటాక్స్ చేసి, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి అప్లై చేయండి. తద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది.
Also Read: ఈ ఆకులతో అనేక ఆరోగ్య సమస్యలు పరార్ !
వర్షాకాలంలో స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తే.. చర్మం చాలా కాలం పాటు శుభ్రంగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది. ఖరీదైన సౌందర్య చికిత్సలకు బదులుగా.. ఈ హోం రెమెడీస్ కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ సీజన్‌లో చర్మాన్ని తేమ , ధూళి నుండి రక్షించడానికి క్రమం తప్పకుండా స్కిన్ కేర్ టిప్స్ పాటించడం చాలా ముఖ్యం.