BigTV English

SBI Hikes MCLR Rate: వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఎస్బీఐ.. అమల్లోకి సవరించిన రేట్లు..!

SBI Hikes MCLR Rate: వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఎస్బీఐ.. అమల్లోకి సవరించిన రేట్లు..!

SBI Hikes Benchmark MCLR Rate: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు మార్జినట్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఈ సవరించిన రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లను ఎస్బీఐ తన అధికారికి వెబ్ సైట్ లో పేర్కొంది. ఇది ప్రధానంగా లోన్ తీసుకున్న వారిపై ప్రభావం చూపనుంది.


ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో వెహికల్, హోం లోన్స్ మరింత ప్రియమైపోయాయి. ఇప్పటికే ఆటో, హోం లోన్లపై వడ్డీరేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించిన ఈఎంఐలు పెరిగాయి. అయితే అంతకుముందు కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ 2020లో వడ్డీరేట్లను తగ్గించడంతో ఎక్కువ మొత్తంలో రుణాలు పొందారు.

మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న తరుణంలో ధరలను కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోయింది. దీంతో రెపోరేటు గరిష్టంగా 6.50శాతానికి చేరింది. గతేడాది ఫిబ్రవరిలో చివరిసారిగా పెంచింది. దీంతో బ్యాంకులు, ఇతరత్రా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచేశాయి. ఈ కారంణంగా వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయని రుణాలు తీసుకున్న వారిపై భారం పడుతోంది. అయితే ఎస్బీఐ రుణగ్రహీతలపై మరింత పెరిగింది. జూన్ నెలలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో కన్జ్యూమర్ లోన్లు ప్రియమైయాయి.


Also Read: జియో, ఎయిర్‌టెల్‌లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది..!

ఏడాదికి గానూ ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఆరు నెలల కాలవ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెంచింది. ఇక రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితికి వరుసగా.. 8.85 శాతం నుంచి 8.95 శాతం, 8.95 శాతం నుంచి 9 శాతానికి ఎస్బీఐ పెంచింది.

అసలు ఎంసీఎల్ ఆర్ అంటే ప్రామాణిక రుణ రేటు. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే వ్యయం నిర్వహణ వ్యయం, సీఆర్ఆర్, కాలపరిమితి, ప్రీమియంలను పరిగణలోకి తీసుకొని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. కాగా, బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణాలు అందించే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం ఎస్బీఐ ఈబీఎల్ఆర్ స్థిరంగా ఉంది. దీంట్లో ఎలాంటి సవరణలు చేయలేదు. ప్రస్తుం ఎస్బీఐ హోంలోన్ వడ్డీ రేటు 8.50 నుంచి 9.65 శాతం మధ్య కొనసాగుతోంది. ఇక, సిబిల్ స్కోర్ సహా ఇతర అర్హతలను ఆధారంగా మారుతుంది.

Tags

Related News

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

Big Stories

×