BigTV English

SBI YONO: ఎస్బీఐ యోనో యాప్ యూజర్లకు అలర్ట్..ఇలా చేయకపోతే ఈ సేవలు మీకు బంద్

SBI YONO: ఎస్బీఐ యోనో యాప్ యూజర్లకు అలర్ట్..ఇలా చేయకపోతే ఈ సేవలు మీకు బంద్

SBI YONO: ప్రస్తుత కాలంలో బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గింది. అనేక మంది కూడా ఆయా బ్యాంకులకు సంబంధించిన యాప్స్ వినియోగిస్తూ ఈజీగా చెల్లింపులు చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో వెయ్యేళ్ల చరిత్ర గల ఎస్బీఐ బ్యాంకింగ్ కూడా యాప్ రూపంలోకి వచ్చేసింది. డిపాజిట్లు, చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్లు ఇలా అనేక రకాల సేవలు కూడా ఫోన్‌లో వన్‌టచ్‌లో జరిగే రోజులు వచ్చేశాయి. అలాంటి డిజిటల్ బ్యాంకింగ్ యుగానికి ప్రతీకగా నిలిచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) YONO యాప్.


పాత ఫోన్‌తో యోనో వాడే వారు జాగ్రత్త
కానీ ఇటీవల SBI తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల కొంతమంది యూజర్లకు బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. మీరు ఇంకా Android 11 లేదా అంతకంటే పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న ఫోన్‌తో SBI YONO యాప్‌ను ఉపయోగిస్తున్నారా. అయితే ఇకపై మీ ఫోన్‌లో యోనో యాప్ పనిచేయదు.

సైబర్ సెక్యూరిటీకి కట్టడి
డిజిటల్ ప్రపంచం వేగంగా మారిపోతున్న సమయంలో, సైబర్ హ్యాకింగ్ ప్రమాదాలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సెక్యూరిటీ అప్‌డేట్లు రావడం ఆగిపోతుండటం వల్ల అవి సైబర్ ముప్పులకు బలైపోతున్నాయి. ఈ నేపథ్యంలో SBI కీలక నిర్ణయం తీసుకుంది. Android 11 కన్నా తక్కువ వర్షన్ ఉన్న ఫోన్లలో YONO యాప్‌కి ఇక మద్దతు ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది.


ఎందుకు SBI ఈ నిర్ణయం?
పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు సాంకేతికంగా వెనుకబడి ఉండటం వల్ల, ఖాతాదారుల డేటాను ప్రొటెక్ట్ చేయడం కష్టంగా మారిందని SBI తన ప్రకటనలో చెప్పింది. ఒకవేళ హ్యాకర్ల చేతిలో డేటా పోతే, కస్టమర్‌కు అనేక నష్టాలు జరగొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ మీద ప్రజల నమ్మకం కూడా తగ్గిపోవచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్తగా SBI ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Become Crorepati: రోజుకు రూ.500 సేవింగ్..కోటి రూపాయల …

యోనో అంటే ఏంటీ?
పూర్తి పేరు YONO – You Only Need One. ఈ యాప్‌ ద్వారా యూజర్లు బ్యాంకింగ్‌తోపాటు, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, షాపింగ్, బిల్స్ పే వంటి అనేక సర్వీసులను ఒకే చోట పొందవచ్చు. YONO అంటే కేవలం ఓ బ్యాంకింగ్ యాప్ మాత్రమే కాదు. ఈ ఒక్క యాప్‌తో మీ జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు.

యోనో మొదటి అడుగు…
YONO యాప్‌ను మొదట 2017 నవంబర్ 27న ప్రారంభించారు. అదే సమయంలో డిజిటల్ ఇండియా మిషన్ జోష్ మీద ఉంది. ఆ తర్వాత YONO Cash అనే ఫీచర్ కూడా 2019 మార్చి 16న లాంచ్ చేశారు. ఈ ఫీచర్ ద్వారా ATM‌లో కార్డు లేకుండానే డబ్బు తీసుకునే అవకాశం వచ్చింది.

మీ ఫోన్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి?
మీరింకా Android 11 లేదా పాత వర్షన్ వాడుతున్నట్లయితే, వెంటనే మీ ఫోన్‌ను Android 12 లేదా అంతకంటే కొత్త వర్షన్ కు అప్‌డేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ YONO యాప్ వాడకంలో అంతరాయం ఉండదు.

అప్‌డేట్ చేయాలంటే:
-మీ ఫోన్ సెట్టింగ్స్ కు వెళ్లండి
-About Phone ఆప్షన్‌ను ఓపెన్ చేయండి
-అక్కడ System Updates అనే విభాగంలోకి వెళ్లండి
-అందుబాటులో ఉన్న కొత్త వర్షన్ Download and Install క్లిక్ చేయండి
-Wi-Fi ఉండగా అప్‌డేట్ చేయడం మంచిది

-ఒకవేళ కొత్త వర్షన్ కోసం నోటిఫికేషన్ రాకపోతే, మాన్యువల్‌గా చెక్ చేయవచ్చు. లేదంటే కొత్త ఫోన్ కొనుగోలు చేయడం Android 12 లేదా కొత్త వర్షన్ ఉన్న మోడల్స్‌లోకి మారడం. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ వాడటం SBI YONO Lite లేదా ఇతర వెబ్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం ఉపయోగించాలి.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×