Kareena Kapoor: రేవ్ పార్టీ అని వింటే చాలు.. సినీ సెలబ్రిటీల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. అలాంటి పార్టీల వల్లే చాలామంది సినీ సెలబ్రిటీలు తమ కెరీర్‌లను పూర్తిగా నాశనం చేసేసుకున్నారు. అయినా కూడా ప్రతీ భాషా ఇండస్ట్రీలో సీక్రెట్‌గా ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉన్నాయని అప్పుడప్పుడు వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇక తాజాగా పాకిస్థాన్‌లో ఒక రేవ్ పార్టీ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉన్నా.. ఆ రేవ్ పార్టీలో డీజే చేసిన పని కరీనా కపూర్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.
ఏంటీ అవతార్.?
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో కరీనా కపూర్‌కు ఉన్న క్రేజే వేరు. ఇప్పటికీ తన ఏజ్‌కు తగిన పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది కరీనా. అలాంటి కరీనాను తాజాగా పాకిస్థాన్ రేవ్ పార్టీలో కనిపించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అసలు విషయం వేరే ఉంది. పాకిస్థాన్‌లో జరిగిన ఆ రేవ్ పార్టీలో కరీనా కపూర్‌కు సంబంధించిన ఏఐ యానిమేషన్ ఫోటోను స్క్రీన్‌పై చూపించాడు ఆ డీజే. దీంతో అక్కడ ఉన్న అభిమానులు దానిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అసలు అది చూడడానికి కరీనాలాగా లేదని, చాలా డిఫరెంట్‌గా ఉందంటూ ఆ ఏఐ అవతార్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి.
అదే ఇన్‌స్పిరేషన్
పాకిస్థాన్ డీజే అయిన హంజా హ్యారీస్ సైతం ఈ వీడియోను స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముందుగా స్క్రీన్‌పై కరీనా కపూర్ (Kareena Kapoor) కనిపించగానే ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లోని తన డైలాగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్‌కు తగినట్టుగా స్క్రీన్‌పై ఉన్న ఏఐ అవతార్ డ్యాన్స్ చేస్తుంది. ‘‘ఈ ట్రాక్‌పై చాలాకాలంగా పనిచేస్తున్నాను. ఈ షో కోసమే దీనిన పూర్తిచేశాను. నేను దీనిని ప్లే చేస్తే దీనికి విజువల్ కూడా ఉండాలని ముందే అనుకున్నాను. నేను కభీ ఖుషీ కభీ ఘమ్ చూస్తున్నప్పుడే ఈ ట్రాక్ గురించి ఐడియా వచ్చింది. అందుకే కరీనా కపూరే ఈ ట్రాక్‌పై డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. రేవ్ పార్టీలో ఇలాంటిది ఇంతకు ముందు ఎవరూ చేయలేదు’’ అంటూ డీజేనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
Also Read: చాలారోజుల నుండి ఈ విషయం దాస్తున్నాను.. సర్‌ప్రైజ్ బయటపెట్టిన వింక్ బ్యూటీ
డిలీట్ చేయండి
మేము ప్లే చేసిన ట్రాక్ హిట్ అయ్యింది. కరీనా కపూర్, కరణ్ జోహార్ ఏదో ఒకరోజు ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆ డీజే అన్నాడు. మొత్తానికి ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అంతా బాగానే ఉన్నా ఆ యానిమేషన్‌లో కరీనా అస్సలు బాలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తను చూడడానికి అసలు కరీనాలాగా లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిని తను చూడడానికి ముందే డిలీట్ చేయమని డీజేకు సలహాలు సైతం ఇస్తున్నారు.
A poorly animated avatar of Kareena Kapoor Khan dancing at a Karachi rave party has elicited a mixed response from fans online. The video, created and shared by a local DJ Hamza Haris, shows the animated actress in formal attire dancing to his track, which samples a line from… pic.twitter.com/SRtZUHN0vW
— The Assam Tribune (@assamtribuneoff) April 10, 2025