SEBI: ప్రస్తుతం అనేక మందికి స్టాక్ మార్కెట్ గురించి తెలియని ఫోన్ కాల్స్ వస్తుంటాయి. కొన్ని సార్లు షేర్ మార్కెట్ సూచనలు, మ్యూచువల్ ఫండ్లు, ట్రేడింగ్ ఆఫర్లు అంటూ ఆఫర్ల పేరుతో కాల్స్ చేస్తుంటారు. చాలామంది ఈ కాల్స్‌ను నమ్మి తమ డబ్బును మోసగాళ్ల చేతిలో పెట్టి నష్టపోతున్నారు. ఇప్పుడు దీన్ని అడ్డుకునేందుకు SEBI (సెబీ) సరికొత్త నిర్ణయం తీసుకుంది.
ఫైనాన్స్ సంబంధిత
ఈ కొత్త విధానం ప్రకారం, ఇకపై SEBI రిజిస్టర్డ్ కంపెనీలు తమ ఖాతాదారులకు ఫోన్ చేయాలంటే కేవలం ‘1600’ సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే కాల్ చేయాలి. అంటే మీరు ఎవరైనా స్టాక్ బ్రోకర్ నుంచి లేదా ఫైనాన్స్ సంబంధిత సంస్థల నుంచి కాల్ అందుకుంటే, ఆ నంబర్ 1600 తో మొదలవుతుందా అని చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు అసలైన కంపెనీ కాల్ చేస్తున్నదో, మోసగాడా అనేది గుర్తించుకోవచ్చు.
ఎందుకో తెలుసా?
-మన దేశంలో పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మోసాలు కూడా పెరుగుతున్నాయి.
-ఫేక్ ట్రేడింగ్ అకౌంట్స్‌కి డబ్బు వేయించాలని ఒత్తిడి చేయడం.
-షార్ట్ టైంలో డబ్బు రెట్టింపు అవుతుందని తప్పుడు హామీలు ఇవ్వడం.
-ఇలాంటి మోసాల నుంచి పెట్టుబడిదారులను రక్షించేందుకు SEBI ఈ కొత్త ‘1600’ ఫోన్ నంబర్ సిరీస్ విధానాన్ని తీసుకువచ్చింది.
ఇది ఎలా పని చేస్తుంది?
1600 సిరీస్ నంబర్లు మాత్రమే: ఇకపై అన్ని SEBI-నియంత్రిత సంస్థలు కేవలం 1600 సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే ఫోన్ చేస్తాయి. ఉదాహరణకు, 1600-123-4567 లాంటి నంబర్.
Read Also: Bluetooth Earbuds: బ్లూటూత్ ఇయర్‌బడ్ లింక్ కాలేదా..ఈ .
వెరిఫై చేయడం సులభం:
మీరు ఓ కాల్ అందుకున్నాక, అది నిజమైనదేనా అన్న అనుమానం వస్తే, నంబర్ 1600తో మొదలవుతున్నదా అని చూసుకోండి. లేదంటే అది మోసం కాల్ కావచ్చు.
ఫిర్యాదు చేయాలంటే:
అనుమానాస్పదంగా అనిపిస్తే 1930 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఇది పెట్టుబడిదారులకు ఎలా ఉపయోగపడుతుంది?
-పెట్టుబడిదారులకు ఎలాంటి కలవరం లేకుండా, నిజమైన సంస్థల నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించగలుగుతారు.
-ఇప్పుడు తప్పుడు ఫోన్ నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను గుర్తించి దూరంగా ఉండవచ్చు.
-ఎవరైనా షేర్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్లు, SIPలు మొదలైనవి చెప్పి ఒత్తిడి చేస్తే, 1600 నంబర్ ఉందా అని చెక్ చేయండి. లేకపోతే, మోసం అని గ్రహించండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-SEBI చేసిన ఈ మంచి చర్యతో పాటు, మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మోసాలను పూర్తిగా నివారించవచ్చు.
-మీరు ట్రేడింగ్ చేయకపోయినా, మీకు లాభం వస్తుందని చెబుతూ ఫోన్లు వస్తే వాటిని నమ్మొద్దు.
-మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు. Aadhaar, PAN, OTP, బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి.
-ఈ మార్పు డైరెక్ట్‌గా మార్కెట్‌ను ప్రభావితం చేయదు. కానీ దీని వల్ల పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో మరింత మంది మార్కెట్‌లోకి అడుగుపెడతారు. దీని వల్ల లాంగ్ టర్మ్‌లో మార్కెట్ స్టేబుల్‌గా మారే అవకాశం ఉంది.