Senior Citizen Savings Scheme: చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేవారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జూలై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే 2026-27 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-SCSS సహా అన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ప్రకటించింది. కాకపోతే ఐదు రకాల కొత్త నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలపై ఓ లుక్కేద్దాం.
సీనియర్ సిటిజన్ పొదుపు పథకం కొత్త రూల్స్
దేశంలో చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. పెట్టుబడులు పెట్టేవారికి చాలా కీలకమైనవి. ఉద్యోగులు, గృహిణులు, పదవీ విరమణ చేసినవారు, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసే తల్లిదండ్రులు, దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునేవారు వీటిపై ఎక్కువగా ఆధారపడతారు. ఇందులో ప్రభుత్వం హామీతోపాటు వడ్డీ లభించడం, పెట్టుబడికి భద్రత, ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండడంతో చాలా ఏళ్లుగా ఆదరణ పొందాయి.. ఇంకా పొందుతున్నాయి కూడా.
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో గతంలో ఉన్న వడ్డీ రేట్లు కొనసాగుతాయి. ఈ పథకాలలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టినవారికి ఎలాంటి మార్పులు లేకుండా అదే రాబడులు రానున్నాయి. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్- SCSS అనేది పదవీ విరమణ చేసినవారి ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఒక పొదుపు పథకం. కనీసం రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల డిపాజిట్ చేయవచ్చు. ఆదాయాన్ని అందించడమే కాకుండా పాత పన్ను విధానం కింద సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
ఆ ఐదు రూల్స్ పాటించాల్సిందే, ఏంటి ఆ నిబంధనలు
ఇక వడ్డీ రేటు విషయానికి వద్దాం. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి 8.2 శాతం వడ్డీ కాగా, దాన్ని యథాతధంగా కొనసాగిస్తోంది. పదవీకాలం ఐదేళ్లు అయినా అదనంగా 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ప్రతి త్రైమాసికంలో మొదటి రోజు వడ్డీ చెల్లిస్తారు. జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతా ఉండాలి. TDS పరిమితి రూ. 100000 వరకు అంతకుమించితే 10 శాతం, PAN లేకపోతే 20 శాతం పడుతుంది. ఖాతా తెరిచే నాటికి 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అర్హులు.
1.వీఆర్ఎస్ లేదా స్పెషల్ వీఆర్ఎస్ కింద పదవీ విరమణ చేసిన 55 ఏళ్లు లేకుంటే అంతకంటే ఎక్కువ ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన నెలలోపు ఖాతాను తెరవచ్చు. రక్షణ సేవల నుండి పదవీ విరమణ చేసిన సిబ్బంది 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన ఒక నెలలోపు ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
2.సీనియర్ సిటిజన్ పొదుపు పథకంలో ఐదు ముఖ్యమైన అంశాలు చాలా కీలకమైనవి. జూలై ఒకటి నుంచి కచ్చితంగా పాటించాలి. ఏడాదిలోపు ఖాతాను మూసి వేస్తే వడ్డీ ఉండదు. అప్పటికే పొందిన ఏదైనా వడ్డీని బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా వసూలు చేయబడుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏడాది లేదా రెండేళ్ల మధ్య క్లోజ్ చేస్తే.. అసలు మొత్తంపై 1.5 శాతం జరిమానాగా తీసుకుంటారు. ప్రారంభించిన తేదీ నుండి రెండేళ్ల తర్వాత డిపాజిట్‌లో 1 శాతం తీసుకుంటారు.
ALSO READ: చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు మారనున్నాయి? తస్మాత్ జాగ్రత్త ఈ పని చేయకుంటే మీకే నష్టం!
3.ఒక వ్యక్తి రెండు విధాలుగా ఖాతాను తెరవచ్చు. ఒకటి వ్యక్తిగత ఖాతా కాగా, మరొకటి ఉమ్మడి ఖాతా. మీ జీవిత భాగస్వామితో మాత్రమే ఉమ్మడి ఖాతాకు అనుమతిస్తారు. జమ చేసిన మొత్తం మొదటి ఖాతాదారునికి చెందుతుంది. వడ్డీ, పెట్టుబడి, పన్ను, అర్హత విషయాలలో మొదటి హోల్డర్‌ను యజమానిగా పరిగణిస్తారు.
4. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (50 ఏళ్లు పైబడినవారు) సర్వీసులో ఉండగా మరణించినా, పదవీ విరమణ లేదా మరణ ప్రయోజనాలు చెల్లించబడితే జీవిత భాగస్వామికి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్ పొదుపు -SCSS ఖాతాను తెరవచ్చు.
5. రూ. 30 లక్షలకు పైబడిన డిపాజిట్‌దారులకు కీలక గమనిక. అదనపు డిపాజిట్ మొత్తంపై పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్ కింద వర్తించే SCSS రేటు కాకుండా, సాధారణ సేవింగ్స్ అకౌంట్‌పై వచ్చే వడ్డీ మాత్రమే లభిస్తుంది.