E-Paper
Advertisement

చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు మారనున్నాయి? తస్మాత్ జాగ్రత్త ఈ పని చేయకుంటే మీకే నష్టం!

చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు మారనున్నాయి? తస్మాత్ జాగ్రత్త ఈ పని చేయకుంటే మీకే నష్టం!
Advertisement

Small Saving Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించంది? ఎందుకంటే రాబోయే త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ సమీక్షించనుంది. పొదుపు చేయబోయే రెండు రోజులు ఆగితే ఎందుకైనా మంచిది. వడ్డీ రేట్లు పెరిగితే సామాన్యుడికి పంటే.

చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వడ్డీ రేట్లు మారనున్నాయి?

Advertisement

రాబోయే మూడు నెలల కాలానికి జూలై-సెప్టెంబర్ 2026కు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహిస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ. వడ్డీ రేట్లను జూన్ 30న ప్రకటించనుంది. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-SCSS, సుకన్య సమృద్ధి యోజన-SSY, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-NSC, కిసాన్ వికాస్ పత్ర-KVP వంటి పథకాలు ఉన్నాయి.

సుదీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లు సవరించబడతాయేమోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పెట్టుబడిదారులు. బెంచ్‌ మార్క్ బాండ్ ఈల్డ్స్ ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎందుకైనా మంచిది డెడ్‌లైన్ ముగిసేలోపు ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఓసారి చెక్ చేసుకోవడం బెటర్. వడ్డీ రేట్లు తగ్గుతాయని భావిస్తే పొదుపుదారులు ప్రస్తుత రేటును లాక్ చేసుకోవడం బెటర్.

Advertisement

తస్మాత్ జాగ్రత్త ఈ పని చేయకుంటే మీకే నష్టం!

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-NSCలో పెట్టుబడి పెట్టినప్పుడు వడ్డీ రేటు మెచ్యూరిటీ వరకు మొదట్లో వడ్డీ మాదిరిగా ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPFలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు మారుతాయి. మారిన వడ్డీ రేటు మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు వెంటనే వర్తిస్తుంది. ఈ నిబంధనలను అర్థం చేసుకుంటే ఎప్పుడు, ఎందులో పెట్టుబడులు పెట్టాలో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన-SSY ఖాతాదారులు డిపాజిట్ నిబంధనలను పాటిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్లు రూ. 50 వేల ట్యాక్స్ లిమిట్‌పై ఫోకస్ చేయాలి. డెడ్‌లైన్ లోపు డబ్బులు జమ చేయాలి. లేకుంటే UPI ద్వారా పేమెంట్ చేస్తే క్రెడిట్ అవుతుంది. పోస్టాఫీస్ ఆన్‌లైన్ లావాదేవీలను జూన్ 30 రాత్రి 8 లోపు పూర్తి చేయాలి. పొదుపు ఖాతాలు ఇన్‌యాక్టివ్ కాకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి.\

ALSO READ: పోస్టాఫీస్ డిపాజిట్ vs బ్యాంక్ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది బెటర్

Related News

బంగారం, రియల్ ఎస్టేట్, ఎఫ్‌డీలపై తగ్గిపోతున్న ఆసక్తి.. భారతీయులు పెట్టుబడి కోసం ఎంచుకుంటున్న కొత్త మార్గాలివే

దిగొస్తున్న పసిడి-వెండి ధరలు, రూ. 3 వేలు పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు

దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?

ఓలా, ఊబర్‌కు షాక్.. క్యాబ్ బుకింగ్‌ కోసం టిప్స్ చెల్లించాల్సిన అవసరం లేదు..

రూ.37వేల సాలరీ నుంచి రూ.2.2 కోట్ల ప్యాకేజీ.. టెకీ కెరీర్ స్టోరీ వైరల్

చంద్రశేఖరన్ వారసుడు ఆయనే? టాటా సన్స్ ఉక్కుమనిషి టీవీ నరేంద్రన్

గిగ్ వర్కర్ల భవిష్యత్‌కు భరోసా.. కేవలం రూ.99తో పెన్షన్!

Big Stories

Advertisement
×