E-Paper
Advertisement

దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు..ఫారెన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో, తారాజువ్వలా సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు

దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు..ఫారెన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో, తారాజువ్వలా సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు
Advertisement

Bombay Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు దేశీయ మార్కె‌ట్‌పై పడింది. చాన్నాళ్ల తర్వాత ముంబైలో దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు కనిపించింది. భారీగా విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలు పాల్పడడంతో సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల మార్క్‌ని టచ్ చేసింది. అటు నిఫ్టీ కూడా 550 పాయింట్లు పెరిగింది. మరి మార్కెట్ ముగిసేవరకు ఇదే కంటిన్యూ అవుతుందా? మధ్యాహ్నం తర్వాత మందగిస్తుందా?

దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు

తగ్గుతున్న ముడిచమురు ధరలు, బంగారం ధరలు పతనం, విదేశీ పెట్టుబడుదారుల నిధుల ప్రవాహం, బలమైన కార్పొరేట్ ఆదాయాలు, బ్యాంకింగ్, టెక్నాలజీ స్టాక్‌ల్లో కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఫలితంగా బాంబే స్టాక్ మార్కెట్‌లో సూచీలు బెంచ్‌ మార్క్ ను తాకాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చాన్నాళ్ల తర్వాత చూశాయి.

ఫారెన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, తారాజువ్వలా సూచీలు

Advertisement

బుధవారం ఉదయం ప్రీ మార్కెట్ నుంచి జోరు కనిపించింది. సరిగ్గా మార్కెట్ 9.15 నిమిషాలకు మొదలైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ 1390 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్లు పెరిగాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుదారులు బ్యాంకింగ్, ఐటీ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడ్డారు. దీంతో సెన్సెక్స్ 2 వేల పాయింట్లు దాటేసింది. ఉదయం 11.20 గంటలకు సెన్సెక్స్ 2,018.67 పాయింట్లు లేదా 2.45 శాతం పెరిగింది. 84,454.66 వద్ద బెంచ్ మార్క్‌ని టచ్ చేసింది.

నిఫ్టీ 587.50 పాయింట్లు పెరిగింది. దాదాపు 2.32 శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం 25,937 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇవాళ మార్కెట్లో మిశ్రమ ధోరణిని కనబరిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ భారీ పెరగ్గా, స్మాల్‌క్యాప్ భారీగా క్షీణించింది.  ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ ఈక్విటీలకు మద్దతునిచ్చాయి. ప్రపంచ చమురు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 90.12 డాలర్ల వద్ద కొనసాగుతంది. అంటే 1.42 శాతం తక్కువగా ట్రేడవుతోంది.

Advertisement

ALSO READ: బంగారం-వెండి ధరలు భారీగా పతనం.. మళ్లీ రద్దీగా మారుతున్నగోల్డ్ షాపులు, డిసెంబర్ 9 వరకు తప్పదా?

నవంబర్‌లో ఇప్పటివరకు సుమారు 23 శాతం క్షీణించింది. చమురు అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్, ధరల తగ్గుదల సానుకూలమైన సంకేతాలు ఇచ్చింది. దేశ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం తగ్గించడంలో సహాయపడుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం కొనుగోళ్లు మద్దతు ఇచ్చారు. నిధుల ప్రవాహంలో సానుకూల ధోరణిని కొనసాగించడంతో ఎఫ్‌ఐఐలు రూ. 5,672.99 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 13.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బ్యాంకింగ్ స్టాక్స్ జోరందుకున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.5 శాతం పెరిగింది. పెట్టుబడిదారులు రద్దీగా ఉండే ఏఐ సంబంధిత ట్రేడ్‌ల నుండి వైదొలగడంతో ఐటీ షేర్లు వరుసగా మూడో సెషన్‌లో తమ ర్యాలీని కొనసాగించాయి. ఇన్ఫోసిస్ 4.4 శాతం పెరిగి అగ్రగామిగా నిలిచింది. నిఫ్టీ-50లో ఈ స్టాక్ లాభపడిన వాటిలో ఒకటిగా ఉంది. దేశీయ ఈక్విటీలలోకి విదేశీ నిధులు బలంగా ప్రవహించడంతో ముడి చమురు ధరలు తగ్గడం వల్ల భారత రూపాయి బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 23 పైసలు బలపడి 92.62కు చేరింది.

Related News

బంగారం-వెండి ధరలు భారీగా పతనం.. మళ్లీ రద్దీగా మారుతున్నగోల్డ్ షాపులు, డిసెంబర్ 9 వరకు తప్పదా?

రెండున్నర దశాబ్దాల తర్వాత.. Gold Spot రీఎంట్రీ, కాంపా టార్గెట్‌గా అడుగులు

SSYలో ఈ విధంగా పెట్టుబడి పెడితే 71 లక్షలకు పైగా… ఎలా సాధ్యం అంటే ?

30 ఏళ్ల వయస్సులో SIP స్టార్ట్ చేస్తున్నారా ? 15 ఏళ్లలోనే కోటీశ్వరులను చేసే లెక్క ఇదే

నెలకు 10000 SIPతో కోటీశ్వరులు కావడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?

అప్పులతో అల్లాడుతున్నారా ? 50:30:20 గోల్డెన్ రూల్ తో లైఫ్ బిందాస్

4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే

Big Stories

Advertisement
×