Business Idea: చదువుకున్న వారికి వ్యాపార అవకాశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక వ్యాపారాన్ని ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏ విధంగా చేసుకోవచ్చు. ఎంత సంపాదన వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అయితే దీని కోసం మీరు బయటకు వెళ్లి ఇంటింటికి తిరగాల్సిన పని లేదు. మీ వద్దకే వచ్చి, నేర్చుకుని మరి డబ్బులు ఇస్తారు. అదేనండి ట్యూషన్ బిజినెస్. సమ్మర్ టైంలో దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. 5వ తరగతి నుంచి మొదలు పెడితే మీ టాలెంటును బట్టి ఇంటర్, ఐఐటీ, డిగ్రీ, సహా అనేక తరగతులకు చెప్పుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి పెట్టుబడి చేయాల్సిన పనిలేదు. విద్యార్థులే బుక్స్ తెచ్చుకుంటారు. వచ్చిన వారికి క్లాసులు తీసుకుని, విద్యార్థుల డౌట్స్ క్లియర్ చేస్తే చాలు.
సరైన ప్రణాళికతో..
సమ్మర్ టైంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో సమ్మర్ ట్యూషన్ బిజినెస్ అనేది ఒక మంచి అవకాశం. పెట్టుబడి తక్కువగా ఉండటమే కాకుండా, సరైన ప్రణాళికతో మీరు నెలకు రూ. 60,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే ఛాన్సుంది. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఏ విధంగా లాభాలు పొందాలనే వివరాలు తెలుసుకుందాం.
సమ్మర్ ట్యూషన్ బిజినెస్ ఎందుకు మంచిది?
- వేసవి సెలవుల్లో పిల్లలకు చదువును నేర్పించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
- స్కూల్స్ సెలవుల నేపథ్యంలో పిల్లలకు టైం ఎక్కువగా ఉంటుంది.
- ఎక్కువగా రిఫ్రెషర్ కోర్సులు, స్పెషల్ క్లాసులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఇది మంచి సమయం.
Read Also: Reliance Shares: 1988లో రిలయన్స్ షేర్లను రూ.10తో కొన్నాడు..ఇప్పుడు వాటి విలువ తెలిసి
ట్యూషన్ బిజినెస్ కోసం అవసరమైనవి
- మీ ఇంట్లోనే ట్యూషన్ ప్రారంభించవచ్చు
- గది లేదా హాల్ లాంటివి ఉంటే ఉపయోగించుకోవచ్చు
- 10 నుంచి 20 మంది పిల్లలకు సరిపడేలా ఉండాలి
బోధన సామగ్రి
- అసవరమైతే బోర్డు, మార్కర్లు, నోట్ బుక్స్, పెన్నులు, పాఠ్యపుస్తకాలు తెచ్చుకోవచ్చు
- చదువుతో పాటు గేమ్స్, క్విజ్‌లు, క్రియేటివ్ యాక్టివిటీస్ నిర్వహించాలి.
ప్రచారం
- మీ ప్రాంతంలోని తల్లిదండ్రులకు నేరుగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం
- వాట్సాప్ గ్రూప్స్, ఫేస్‌బుక్ గ్రూప్స్ ద్వారా ప్రచారం చేయడం
- వచ్చిన స్టూడెంట్స్‌కు డెమో క్లాస్ ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించవచ్చు
- సోషల్ మీడియాలో ఫోటో లేదా వీడియో పోస్ట్ క్రియేట్ చేసుకుని కూడా ప్రచారం చేసుకోవచ్చు
లాభం
సాధారణంగా ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థులు నెలకు కనీసం రూ. 2 వేలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు టెన్త్, ఇంటర్ లేదా ఐఐటీ సహా ఇతర ట్యూషన్లు చెప్పగలిగితే ఇంకా ఎక్కువగా ఇస్తారు. ఈ క్రమంలో కనీసం మీరు నెలకు 25 మందికి ట్యూషన్ చెప్పినా కూడా నెలకు 50 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు.
ట్యూషన్ ప్రారంభించేందుకు ఉండాల్సిన లక్షణాలు
- అధ్యాపన నైపుణ్యం: విద్యార్థులకు క్లియర్‌గా విషయాలు అర్థమయ్యేలా చెప్పగలగాలి
- మ్యాథ్య్ లేదా సైన్స్ వంటి సబ్జెక్టులు అవగాహన లేకుంటే, నేర్చుకుని చెప్పే విధంగా ఉండాలి
- పిల్లలకు ఆసక్తిగా ఉండేలా గేమ్స్, క్విజ్‌లు నిర్వహించాలి
- పిల్లల తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్, వారితో క్రమం తప్పకుండా కమ్యూనికేషన్ ఉంచుకోవాలి
- నైపుణ్యాన్ని పెంచుకుని, విద్యార్థులకు మేలు కలిగించేలా క్లాసెస్ నిర్వహించాలి
- సృజనాత్మకంగా ఆలోచించి, విద్యార్థులకు మోటివేషన్ క్లాసులతోపాటు స్టోరీలు కూడా చెప్పగలగాలి
Tags

Share