Best Cars Under Rs 10 Lakhs With 6 Airbags: కొత్తగా కారును కొనాలనుకునే వారు ఆ కారుకు సంబంధించిన మైలేజీ, ఫీచర్లు, ధర, సేఫ్టీ ఫీచర్లు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మైలేజీ, సేఫ్టీ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ధర ఎంత ఉన్నా.. కారు సేఫ్టీ పరంగా అద్భుతంగా ఉందా లేదా అని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ దారులు తమ కంపెనీ నుంచి రిలీజ్ చేస్తున్న మోడళ్లలో కేవలం వాటిపైనే ఫోకస్ పెట్టాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఎయిర్‌బ్యాగులు.
సాధారణంగా ఒక్కో కారుకు ఒకటి లేదా ఆరు వరకు ఎయిర్ బ్యాగులు అందిస్తారు. అయితే ఒక్క ఎయిర్ బ్యాగ్ అయితే మిగతా ప్రయాణికులకు కష్టంగా ఉంటుంది. అదే ఆరు ఎయిర్ బ్యాగులు అందించే కార్లు మంచి సేఫ్టీ అని వినియోగదారులు ఫీలవుతుంటారు. మరి అలాంటి ఆరు ఎయిర్ బ్యాగులు అందించే కార్లు, ఎస్యూవీల లిస్ట్ ఇక్కడ ఉంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hyundai Grand i10 NIOS
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ దక్షిణ కొరియా బ్రాండ్ హ్యాచ్‌బ్యాక్ ఆరు ఎయిర్ బ్యాగ్‌లతో అతి తక్కువ బడ్జెట్‌లో సామాన్యులకు అనుగుణమైన ధరలో అందుబాటులో ఉంది. ఈ కారు రూ.5.92 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది గత అక్టోబర్‌లో అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్‌గా అందించింది.
Also Read: టాప్-10 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే.. అమ్మకాల్లో రికార్డులే రికార్డులు..!
Hyundai Exter
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్యూవీ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎమ్‌టీని కలిగి ఉంది. ఇది 1.2 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో సిఎన్‌జీ వెర్షన్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఎస్యూవీ కూడా ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత తక్కువ ధరలో భారతదేశంలో అందుబాటులో ఉంది. కేవలం రూ.6.13 లక్షల ప్రారంభ ధరతో కొనుక్కోవచ్చు.
Maruti Suzuki Swift
మారుతి సుజుకి కంపెనీకి మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను మరింత విస్తరించేందుకు కంపెనీ ఇటీవల కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇటీవల కంపెనీ న్యూ 4th జెన్ మారుతి స్విఫ్ట్ దాని మోడల్‌లో ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది 27.75 కెఎమ్‌పిఎల్ క్లాస్ లీడింగ్ మైలేజీని అందిస్తుంది.
Also Read: సిటీ డ్రైవింగ్.. దేశంలో టాప్ -3 EVలు ఇవే..!
Hyundai i20
హ్యుందాయ్ ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్. ఇది ఆరు ఎయిర్ బ్యాగ్‌లను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్, 4సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆప్షనల్ సివిటిను కలిగి ఉంటుంది.
Hyundai Aura
హ్యుందాయ్ ఆరా మోడల్ కూడా ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. ఈ మోడల్ హ్యుందాయ్ ఎక్స్‌టర్, హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోన్ వంటి మోడళ్ల మాదిరిగానే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పరుగులు పెడుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5స్పీడ్ ఏఎంటీతో అందుబాటులో ఉంటుంది.
Mahindra XUV 3XO
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 1.2 లీటర్ టర్బో – పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది రూ.7.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వీటితో పాటు హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue), కియా సోనెట్, టాటా నెక్సాన్(Tata Nexon), మారుతి సుజుకి బాలెనో(Maruti Suzuki Baleno) (జిటా వేరియంట్) వంటి మోడల్స్ మంచి ధరలో, ఆరు ఎయిర్ బ్యాగులతో అందుబాటులో ఉన్నాయి.