BigTV English

Post Office Schemes : ఈ పోస్టాఫీస్ పథకాలకు డిమాండ్ ఎక్కువ.. ఎందులో ఎక్కువ లాభం ఉందో చూడండి..

Post Office Schemes : ఈ పోస్టాఫీస్ పథకాలకు డిమాండ్ ఎక్కువ.. ఎందులో ఎక్కువ లాభం ఉందో చూడండి..
Post Office Savings Schemes
Post Office Savings Schemes

Post Office Savings Schemes : పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్. చిట్టీలు కట్టో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టో.. అవి వస్తాయో రావో తెలియక టెన్షన్ పడుతూ ఉండే కంటే.. మీకొచ్చే సంపాదనలో నెలకు కాస్తంత పోస్టాఫీస్ స్కీమ్ లో పెడితే.. వార్షిక ప్రాతిపదికన వడ్డీతో పాటు.. మీకు కావలసినపుడు అసలు మొత్తాన్నీ తీసుకోవచ్చు. వీటికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఇవి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి. కొన్ని స్కీమ్ లకు త్రైమాసికాల వారిగా, మరికొన్నింటికి 6 నెలలకు, ఇంకొన్నింటికి వార్షిక ప్రాతిపదికన వడ్డీ వస్తుంది.


పోస్టాఫీస్ స్కీమ్స్ లలో అన్ని వర్గాల వారికోసం స్కీమ్ లు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక స్కీమ్ లు సహా.. మహిళల కోసం మహిళా సమ్మాన్, ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, ఉద్యోగులకై పీపీఎఫ్ సహా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లు, టైమ్ డిపాజిట్లు.. ఇలా చాలా పథకాలే ఉన్నాయి. వాటిలో కొన్ని పథకాలు, వాటిలో వచ్చే వడ్డీల గురించి తెలుసుకుందాం.

Read More : మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ. 5.49 కోట్ల జరిమానా..


పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ : ఈ అకౌంట్ లో నెలకు కనీసం రూ.500 చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు. వార్షిక ప్రాతిపదికన ప్రస్తుతం 4 శాతం వడ్డీ లభిస్తుంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ : పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్లలో వేర్వేరు టెన్యూర్లుంటాయి. ఒక ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై 6.9 శాతం, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్ల టెన్యూర్ కు 7.1 శాతం వడ్డీ, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పై 7.50 శాతం వడ్డీ అందిస్తోంది ఈ స్కీమ్.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ : పోస్టాఫీస్ పథకాలలో అత్యధిక వడ్డీని అందించే స్కీమ్ లలో ఇది ఒకటి. రూ.1000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకూ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం.. జనవరి – మార్చి వరకూ అత్యధికంగా 8.20 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ స్కీమ్ కు 60 ఏళ్లు దాటిన వారు అర్హులవుతారు. సెక్షన్ 80-సీ కింద ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకూ టాక్స్ ను తగ్గించుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన : ఈ పథకం కూడా ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేసుకోవచ్చు. పదేళ్ల లోపు వయసున్న ఆడపిల్లలు అర్హులు. 15 సంవత్సరాల వరకూ డబ్బులు కడితే.. ఆడపిల్లకు 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కం స్కీమ్ : ఈ స్కీమ్ లో భాగంగా కనీసం రూ.1000 డిపాజిట్ చేయాలి. సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్లో అయితే రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద నెలకు 7.40 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.

పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ : రూ. 1000 కనీస డిపాజిట్ తో ఈ స్కీమ్ ను తీసుకోవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం 7.7 శాతం వడ్డీరేటు ఉంది. ప్రతి వార్షిక సంవత్సరానికీ ఒకసారి వడ్డీరేటు లెక్కించి.. మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ : ఇది కేవలం మహిళల కోసమే. రెండేళ్ల టెన్యూర్ ఉంటుంది. వడ్డీ 7.5 శాతం వరకూ వస్తుంది. కనీస డిపాజిట్ రూ.1000.

కిసాన్ వికాస్ పత్ర : ఈ స్కీమ్ కు గరిష్ఠ పరిమితి లేదు. కనీస డిపాజిట్ రూ.1000. ప్రస్తుత వడ్డీరేటు 7.5 శాతం. 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపవుతుంది.

పీపీఎఫ్ : ఇప్పుడున్న పోస్టాఫీస్ పథకాల్లో దీనికి డిమాండ్ ఉంది. వడ్డీరేటు 7.10 శాతమే ఉన్నా.. దీర్ఘకాలంలో భారీ రిటర్న్స్ వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×