Rahul Dravid injured: మరికొద్ది రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ప్రారంభం కానున్నవేళ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ {Rahul Dravid injured} గాయపడ్డారు. బెంగళూరులో క్రికెట్ ఆడుతుండగా రాహుల్ ద్రావిడ్ ఎడమ గాలికి గాయమైంది. ద్రావిడ్ తన కొడుకుతో క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు. దీంతో అతడు మైదానాన్ని వదిలి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు.
Also Read: Sanju Samson: IPLలో ఆ రూల్ మార్చాల్సిందే.. శాంసన్ సంచలనం!
అనంతరం వైద్యులు ద్రావిడ్ కాలికి కట్టువేశారు. ఇక అప్పటినుండి ద్రావిడ్ క్రచెస్ సహాయంతో నెమ్మదిగా నడుస్తున్నట్లు కనిపించాడు. ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ఈనెల 22 నుండి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ద్రావిడ్ ట్రైనింగ్ సెషన్ కి మెడికల్ వాకింగ్ బూట్ వేసుకునే గ్రౌండ్ కి వచ్చాడు. కాలికి వాకింగ్ బూట్ ఉన్నా.. ద్రావిడ్ మాత్రం చురుకుగా ట్రైనింగ్ స్టేషన్ లో పాల్గొన్నాడు. కొందరు ఆటగాళ్లతో కలిసి డిస్కషన్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైష్వాల్ తో ముచ్చటించాడు. బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించాడు ద్రావిడ్. మరోవైపు ద్రావిడ్ పరిస్థితి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ద్రావిడ్ కాలికి పెద్ద బ్యాండేజ్ కట్టుకొని కనిపించడంతో.. ఆ ఫోటోలు {Rahul Dravid injured} సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
అయితే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గ్రూప్ 3 సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరుకు చెందిన విజయ్ క్రికెట్ క్లబ్ తరఫున ద్రావిడ్ ఆడుతున్న సమయంలోనే ఈ గాయం సంభవించింది. అతడు తన కుమారుడు అన్వే ద్రవిడ్ తో కలిసి ఆడిన సందర్భంలో 28 బంతులలో 29 పరుగులు చేశాడు. ఆ సందర్భంలో వికెట్ల మధ్య పరిగెడుతున్నప్పుడు ద్రవిడ్ కాలిలో నొప్పి సంభవించింది. అసౌకర్యం పెరగడంతో అతడు మైదానాన్ని వదిలి చికిత్స తీసుకొని.. తాజాగా రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో చేరాడు.
Also Read: IPL Trophy SRH: ఈ సారి కప్ SRHదే.. ఇదిగో లెక్కలు ఇవే !
ఇక రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర, కెప్టెన్ సంజు శాంసంగ్ తో కలిసి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ సంవత్సరం జట్టు విజయాల కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఐపీఎల్ తొలి విజేత అయిన రాజస్థాన్ రాయల్స్.. 17 సంవత్సరాల తర్వాత మరోసారి ఛాంపియన్ కావాలని ఎదురుచూస్తోంది. ఇందుకోసం ఆటగాళ్లు సైతం మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 1996 ఏప్రిల్ 3న శ్రీలంకతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన రాహుల్ ద్రావిడ్.. 2012 జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ తో క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. తన కెరీర్ లో 164 టెస్టుల్లో 36 సెంచరీలు, 344 వన్డేలో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 13,288 పరుగులు, వన్డేల్లో 10, 889 పరుగులు సాధించాడు.