Big Stories

Stock Market Highlights: కొత్త ఆర్ధిక సంవత్సరంలో జోష్.. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు

Stock market updat
Stock Market Update: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు దన్నుగా నిలవడంతో సెన్సెక్ 74,000 మార్కును తాకింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 363 పాయింట్ల లాభంతో 73,968.62 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లో కొనసాగింది.

ఇంట్రాడేలో 74,254.62 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుని ఆల్ టైమ్ హైకి చేరింది. చివరికి 323.20 పాయింట్ల లాభంతో 74,014.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.10 పాయింట్ల లాభంతో 22,450 వద్ద స్థిరపడింది.

- Advertisement -

Also Read: పీఎఫ్ కొత్తరూల్.. ఎన్ని ఉద్యోగాలు మారినా ప్రాబ్లమ్ ఉండదట..

- Advertisement -

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్‌లో వృద్ధిని కనబరిచిన స్టాక్‌ల గురించి మాట్లాడినట్లయితే, JSW స్టీల్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ , లార్సెన్ & టూబ్రో ,హిందుస్థాన్ యూనిలివర్, SBI కంపెనీలు లాభాలతో ముగిసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40 గా ఉంది.

ఐషర్ మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, ఎల్‌టిఐ మైండ్ ట్రీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీ ,షేర్లు నష్టాల్లో చేరాయి. ఆయిల్, గ్యాస్, బ్యాంక్ 0.5 శాతం పెరిగాయి. బీఎస్ ఈ మిడ్ క్యాంప్ ఇండెక్స్ 1.6 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 3 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ 86. 64 డాలర్లు, బంగారం ఔన్సు 2,270 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News