BigTV English

5 Star Safety Rating Car: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 26 కి.మీ మైలేజీతో బెస్ట్ కారు ఇదే..!

5 Star Safety Rating Car: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 26 కి.మీ మైలేజీతో బెస్ట్ కారు ఇదే..!

5 Star Safety Rating Car: ప్రస్తుత కాలంలో రోడ్లపై యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. అందులోనూ కార్ యాక్సిడెంట్లే ఎక్కువ. అందువల్లనే చాలా మంది వాహన ప్రియులు లుక్, డిజైన్, మైలేజీ, ధరతో పాటు అందులో ఉండే ముఖ్యమైన సేఫ్టీ విషయంలోనూ ఇప్పుడు జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 5 స్టార్ రేటింగ్ కలిగిన కార్లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్ ధరలో ఉన్న మంచి సేఫ్టీ కార్లను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే ఆలోచనతో మీరూ ఉంటే.. మీకొక గుడ్ న్యూస్. ఇప్పుడు రూ.7 లక్షల లోపు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు గురించి తెలుసుకుందా.


ప్రముఖ కార్ల తయారీ కంపెనీలో అగ్రగామిగా ఉంది టాటా మోటార్. ఈ కంపెనీ కొత్త కొత్త కార్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే అందులో టాటా ఆల్ట్రోజ్ ముందు వరుసలో ఉంటుంది. ఇది అద్భుతమైన డిజైన్, లుక్‌తో సహా సేఫ్టీ పరంగా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ కారు రూ.6.65 లక్షల ఎక్స్ షోరూమ్ ధర నుంచి స్టార్ట్ అవుతుంది.

Also Read: ఫుల్ ట్రాఫిక్ ఉందా.. ఇదిగో బెస్ట్ కార్లు.. ధర మాత్రం చాలా తక్కువ..!


ఇది దాని డిజైన్‌తోనే కాకుండా వాహన ప్రియుల నుంచి సేఫ్టీ పరంగా అదిరిపోయే స్పందన అందుకుంటుంది. ఈ కారు 5 స్టార్ గ్లోబల్ ఎన్‌సిఏపీ సేఫ్టీ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా వృద్ధుల సేఫ్టీలో 5 స్టార్, చిల్డ్రన్స్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ అందుకుంది. అలాగే ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి. అందులో డ్రైవర్, ప్యాసింజర్‌కి సరిపోతాయి.

అలాగే ఇందులో ఓవర్ స్పీడ్ అలెర్ట్, యాంకర్ పాయింట్, యాంటీ థెఫ్ట్ ఇంజన్ ఇమ్మెబిలైజర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, చైల్డ్ లాక్, సెంట్రల్ లాకింగ్‌తో సహా మరిన్ని ఫీచర్లు ఇందులో అందించారు. కాగా ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అందులో 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో వస్తుంది. ఇది పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 19.33 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే కిలోగ్రాము సిఎన్‌జికి 26.2 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Tags

Related News

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

DMart: ఐటీ జాబ్ కంటే డిమార్ట్ లో ఉద్యోగం బెస్ట్, సాలరీతో పాటు ఇన్ని సౌకర్యాలా?

Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!

UPI New Rules: యూపీఐ లావాదేవీలకు షాక్‌! సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ మార్చిన ప్రభుత్వం

Big Stories

×