BigTV English

NEET UG 2024: గ్రేస్ మార్కులు పొందిన వారికి రీ ఎగ్జామ్.. సగం మంది డుమ్మా..

NEET UG 2024: గ్రేస్ మార్కులు పొందిన వారికి రీ ఎగ్జామ్.. సగం మంది డుమ్మా..

NEET UG 2024 Re-exam: NEET-UGలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆదివారం రీ ఎగ్జామ్‌ను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు దాదాపు 750 మంది గైర్హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, మేఘాలయలోని కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. మొత్తంగా ఈ పరీక్షకు 813 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడు కేంద్రాల్లో మళ్లీ పరీక్ష నిర్వహించారు. మే 5న పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైన ఆరు కేంద్రాల్లో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు గ్రేస్ మార్కులు కేటాయించారు.

మాల్‌ప్రాక్టీస్ కారణంగా దేశవ్యాప్తంగా 63 మంది అభ్యర్థులు నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరుకాకుండా డిబార్ చేసినట్లు ఎన్టీయే తెలిపింది.


విద్యార్థులకు ప్రదానం చేసిన గ్రేస్ మార్కులను ఎన్టీయే ఉపసంహరించుకున్న తర్వాత మెడికల్ ప్రవేశ పరీక్షకు తిరిగి రీ ఎగ్జామ్ నిర్వహించారు.

బీహార్‌కు చెందిన 17 మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడినందుకు డిబార్ అయ్యారని.. గోద్రాలోని కేంద్రాల నుంచి 30 మంది అభ్యర్థులు డిబార్ అయ్యారని ఎన్టీయే తెలిపింది.

Also Read: నీట్‌లో అవకతవకలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

ప్రవేశ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణల మధ్య, ఎన్టీయే ఆదివారం తన వెబ్‌సైట్, అన్ని వెబ్ పోర్టల్‌లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది. పోర్టల్‌లు రాజీ పడుతున్నాయనే ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. అవన్నీ తప్పుదోవ పట్టించే ఆరోపణలని ఎన్టీయే కొట్టిపారేసింది.

ఇప్పటికే నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది.

Tags

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×