Big Stories

Tata Nexon CNG : త్వరలో టాటా నెక్సాన్ సీఎన్‌జీ.. మైలేజీ, ఫీచర్లు ఇవే!

Tata Nexon CNG : టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటి. కంపెనీ కార్లు అద్భుతమైన భద్రతకు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా టాటా  నెక్సాన్ కారు చాలా ప్రజాదరణ పొందింది. పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తున్నారు. ఇంతలో కంపెనీ తన లైనప్‌ను అప్‌డేట్ చేయబోతోంది. త్వరలో కొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీని విడుదల చేయబోతుంది. కొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. ట్రయల్ రన్ సమయంలో కొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీ పూణే సమీపంలోని సీఎన్‌జీ స్టేషన్‌లో కనిపించింది. వీటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

CNGతో పనిచేసే కొత్త నెక్సాన్ SUVకి 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 PS పవర్,150 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కొత్త Nexon CNG 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రావచ్చు.కొత్త టాటా నెక్సాన్ CNG కారు 26.99 km/kg మైలేజీని ఇస్తుంది. దీని డిజైన్, ఫీచర్లు దాదాపు పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటాయి.

- Advertisement -

Also Read : మారుతీ సంచలన నిర్ణయం.. అన్నీ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

అయితే ఈ కారుకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. త్వరలో కంపెనీ Nexon CNG అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా నెక్సాన్ SUV ICE ఇంజన్‌తో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 8.15 లక్షల నుండి రూ. 15.80 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది స్మార్ట్ ఫియర్‌లెస్ ప్లస్, ప్యూర్ వంటి విభిన్న వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

Also Read : కియా లవర్స్‌కు పండగే.. త్వరలో మూడు కొత్త EVలు లాంచ్!

టాటా నెక్సాన్ ICE పవర్‌ట్రెయిన్‌లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) గేర్‌బాక్స్‌లతో ఉంది. ఇది 17.01 నుండి 24.08 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News