EPAPER

Tata Curvv: టాటా కర్వ్ ఈవీ.. ప్రత్యేకతలు ఇవే.. త్వరలో లాంచ్!

Tata Curvv: టాటా కర్వ్ ఈవీ.. ప్రత్యేకతలు ఇవే.. త్వరలో లాంచ్!

Tata Curvv: టాటా బ్రాండ్ అంటే దేశంలో ప్రజలు భరోసాగా భావిస్తారు. అందుకే ఈ కంపెనీ నుంచి ఏదైనా కారు వస్తుందంటే ఇంటరెస్ట్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే టాటా రాబోయే ఎలక్ట్రిక్ SUV కర్వ్ (Curvv) ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా కంపెనీ తన అఫిషియల్ టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీని ప్రకారం త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.


ప్రస్తుతం ఇది టెస్టింగ్‌లో ఉంది. దీన్ని ఆన్-రోడ్, ఆఫ్-రోడ్‌లో టెస్ట్ చేస్తున్నారు. కంపెనీ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో దీన్ని టెస్ట్ చేస్తోంది. కంపెనీ మొదటిగా కర్వ్ ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. టాటా కర్వ్ EV హారియర్, నెక్సాన్ మధ్యగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశం ఉంది. టాటా కర్వ్‌కు సంబంధించి ఇప్పుడు ఏడు పెద్ద విషయాలను తెలుసుకుందాం.

Also Read: Tata Motors: టాటా మోటర్స్ కనివినీ ఎరుగని ఆఫర్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే?


టాటా కర్వ్ డిజైన్ స్టైలిష్, ప్రీమియంగా ఉండబోతోంది. కారు ముందు, వెనుక భాగంలో లైట్లు అందుబాటులో ఉంటాయి. దీనికి వంపుగా ఉండే రూఫ్ లైన్ ఉంటుంది. ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మీరు ప్రస్తుతం Nexon EVలో కూడా అదే వీల్స్ చూడవచ్చు. కర్వ్ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం ఫీల్‌ను అందించడంలో సహాయపడుతుంది. ఈ ఫీచర్‌తో వస్తున్న మొదటి కారు ఇదే.

టాటా కర్వ్ 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది కాకుండావైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పనోరమిక్ సన్‌రూఫ్,ఎయిర్ ప్యూరిఫైయర్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉంటాయి.

టాటా కర్వ్ EV ధర రూ. 18-20 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ మోడల్‌ను దాదాపు రూ. 10-11 లక్షల ధరతో విడుదల చేయవచ్చు. ఇప్పుడు టాటా ఎలక్ట్రిక్ మోడల్ MG ZS EV, హ్యుందాయ్ క్రెటా EVతో నేరుగా పోటీపడుతుంది. కర్వ్ పెట్రోల్-డీజిల్ మోడల్ టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్, గ్రాండ్ విటారా, సిట్రోయెన్ బసాల్ట్, కియా సెల్టోస్‌, హ్యుందాయ్ క్రెటాలతో పోటీపడుతుంది.

టాటా కొత్త కర్వ్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ గురించి కంపెనీ ఎటువంటి సమాయారాన్ని అందించలేదు. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదు. రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు. అలానే టాటా కర్వ్‌లో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది.

Also Read:Toyota Rumion CNG: ఈ కార్లకు భారీ క్యూ.. ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో!

టాటా కర్వ్ ఎలక్ట్రిక్‌లోని సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అలానే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 2 అడాస్, లాన్ కీప్ అసిస్ట్, అటానమస్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా చూడొచ్చు. దీని పొడవు 4308mm, వెడల్పు 1810mm,  ఎత్తు 1630mmవీల్‌బేస్ 2650mm.

టాటా న్యూ కర్వ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 12 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 125 పీఎస్ పవర్, 25 ఎన్‌ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది 1.5-లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 113 bhp పవర్‌ని, 260 Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి.

Related News

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Zomato Hikes : ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. దీపావళికి కానుకగా కస్టమర్లకు భారీ షాక్!

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Maharaja’s Express Train: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Today Gold Prices: పండగ వేళ భారీ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Big Stories

×