BigTV English

Honda Elevate : జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కార్లు.. అట్లుంటది మనతో!

Honda Elevate : జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కార్లు.. అట్లుంటది మనతో!
honda elevate
Honda elevate

Honda Cars Export Japan : భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ ‘ఎలివేట్’. ఈ వెహికల్ 2023 సెప్టెంబర్ నెలలో దేశంలో లాంచ్ అయింది. SUV వెహికల్ సెగ్మెంట్‌లో ప్రారంభం నుంచే ఎగుమతుల్లో తన హవా కొనసాగిస్తోంది.


హోండా ఎలివేట్ సెప్టెంబర్ 2023లో లాంచ్ అయినప్పటి నుంచి సుమారు 30365 యూనిట్లను డీలర్లకు విక్రయించుంది. SUV సేల్స్ ప్రారంభమైనప్పటి నుంచి 2024 ఫిబ్రవరి చివర వరకు మిడ్‌సైజ్ వాహన విభాగంలో రెండవ అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా ఎలివేట్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు
మొత్తం 79513 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్‌ను విక్రయించి అమ్మకాల్లో 38 శాతం వాటాను ఆక్రమించింది హోండా కంపెనీ.

Also Read : కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఈ వాహనాల కొనుగోళ్లపై భారీ సబ్సిడీ!


కంపెనీ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో సేల్స్ 33339 యూనిట్లు కాగా.. సిటీ సేల్స్ 15809 యూనిట్లుగా నమోదైంది. ఈ అమ్మకాల్లో హోండా ఎలివేట్ కూడా 1.32 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కారు మార్కెట్‌లో మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా , కియా సెల్టోస్ వంటి కార్ల అమ్మకాలకు గట్టి పోటీని ఇస్తోంది.

అయితే తాగాజా జపాన్ మార్కెట్‌పై కన్నేసింది. దీంతో అక్కడ కూడా కార్లను విక్రయించేందుకు ఎగుమతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది హోండా కంపెనీ. ఇండియాలో తయారైన కారును కంపెనీ రాజస్థాన్ టపుకరా ప్లాంట్ నుంచి ఎగుమతి చేస్తోంది. కానీ ఈ కారుకు డబ్ల్యుఆర్-వీ వెహికల్ అనే బ్యాడ్జ్‌తో విక్రయిస్తోంది.

ఇండియా మోడల్‌తో సమానంగా అదే 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన కార్లను జపాన్‌లోను అమ్మకాలను సిద్ధం చేసింది. అయితే ఇది బ్లాక్ అండ్ బేజ్ అనే డ్యూయెల్ టోన్ కలర్‌తో రూపొందించారు. ఇండియా మోడల్ మాత్రం గోధుమరంగు క్యాబిన్ కలిగి ఉంటుంది. మొత్తానికి ఇండియా మోడల్ మాదిరిగానే జపాన్ మోడల్ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని టాక్ వినిసిస్తోంది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ డేటా ఆధారంగా 2024 ఫిబ్రవరి చివరి నాటికి హోండా ఇండియా నుంచి కార్లను ఎగుమతి చేసిన సంఖ్య రూ. 6809 కోట్లు విలువ చేసే యూనిట్లు. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రారంభం కంపెనీ ఎగుమతులను పెంచింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 6472 యూనిట్లను హోండా ఎగుమతి చేసింది.

Also Read : ఇండియాలో కియా కొత్త ఎస్​యూవీ..అదిరిపోయిన ఫీచర్స్

హోండా మోటార్స్ డబ్ల్యుఆర్-వీ మోడల్ అమ్మకాలను మార్చి 22 నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం 3000 యూనిట్లు విక్రయించాలని లక్షంగా పెట్టుకుంది. అంటే సంవత్సరానికి 36000 యూనిట్లుగా విక్రయించడానికి సిద్ధమైంది. ఈ విధంగా జరిగితే ఇండియా కార్స్ జపాన్‌లో రికార్డ్ క్రియేట్ చేసినట్లే.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×